టీ20 జట్టులోకి ఎంపికైన సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌లకి తుది జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ చోటు ఇవ్వలేదు. ఇటీవల ముగిసిన నాలుగు టెస్టుల సిరీస్‌ని 3-1తో చేజిక్కించుకున్న టీమిండియా టీ20 సిరీస్‌లో కూడా అదే జోరుని కొనసాగించాలని ప్రయత్నిస్తుంది. భారత్‌తో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ టీమ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఫీల్డింగ్ ఎంచుకున్నారు. ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్ జరగనున్న ఈ సమయంలో ఆ టోర్నీ సన్నద్ధత కోసం ఈ టీ20 సిరీస్‌ని వినియోగించుకోవాలని రెండు జట్లూ ఆశిస్తున్నాయి.
విరాట్ కోహ్లీ ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్‌లను ఎంచుకున్నారు. హార్దిక్ పాండ్య, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ రూపంలో ముగ్గురు ఆల్‌రౌండర్లకి తుది జట్టులో కోహ్లీ చోటు దొరికింది. భువనేశ్వర్‌కి జోడీగా ఉండవలసిన టి. నటరాజన్ గాయం కారణంగా ఈ మ్యాచ్‌కి దూరం కాగా, శార్ధూల్ ఠాకూర్ ను ఎంపిక చేశారు. ఆస్ట్రేలియా టూర్లో బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ ఠాకూర్ రాణించడంతో ఈ ఎంపిక జరిగింది. భారత్ జట్టులోకి మొదటిసారి ఎంపికైన సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌లకి ఈసారికి చోటు దొరకలేదు. ఇక స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఫిట్నెస్ టెస్టులో ఫెయిలవడంతో చోటు దొరకలేదు.అలాగే సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మకి కూడా ఈ మ్యాచ్ నుండి రెస్ట్ దొరికింది.