విద్యా సంవత్సరం (2021-22) నుంచే ఇంజినీరింగ్‌ కోసం గణితం, భౌతిక శాస్త్రం తప్పనిసరి కాదని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) స్పష్టం చేసింది. భారతీయ భాషల్లో సాంకేతిక విద్యను అందించాలన్న నూతన జాతీయ విద్యా విధానం -2020 లక్ష్యానికి అనుగుణంగా ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు. బిటెక్‌ కోర్సులకు ప్రవేశం పొందడానికి 12వ తరగతి గణితం, భౌతిక శాస్త్రాన్ని ఆప్షనల్ చేసింది.

2022 నుంచి ఇంజనీరింగ్‌ మరియు టెక్నాలజీలో అండర్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి పదో తరగతి స్థాయి గణిత, భౌతిక శాస్త్రాలను తప్పనిసరి చేసింది. అయితే ఏఐసీటీఈ విడుదల చేసిన 2021-22కు ప్రవేశాలకు అర్హత ప్రమాణాలను మార్చి ఇంజనీరింగ్‌ కోర్సుకు గణితం, భౌతిక శాస్త్రాలు తప్పనిసరి కాదని స్పష్టం చేసింది.


ఇంజనీరింగ్‌ డిగ్రీలకు గణితం ఒకప్పుడు పునాది అని చెప్పిన విద్యావేత్తల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇంజనీరింగ్‌ కోసం ఏఐసీటీసీ యొక్క మోడల్‌ పాఠ్యప్రమాణానికి దాదాపు అన్ని ప్రోగ్రామ్‌లలో గణితం ఐదో సెమిస్టర్‌ వరకు కొనసాగుతుంది. అలాగే అన్ని బ్రాంచీల్లో కాకుండా సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఈసీఈ తదితర ఇంజనీరింగ్‌ బ్రాంచీల్లో మాత్రమే మాతృభాషలో బీటెక్‌ను బోధించేందుకు అనుమతి ఇవ్వనుంది.