హైదరాబాద్లో సంతోష్ దాబా అంటే శాకాహార భోజన ప్రియులందరికీ పరిచయమే! నగరంలో ఈ దాబాకు పలు బ్రాంచ్‌లు ఉన్నాయి. కాగా అబిడ్స్‌లోని సంతోష్ దాబాలో పేకాట నిర్వహిస్తున్నారు. విశ్వసనీయమైన సమాచారం రావడంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న దాని యజమాని సహా 8 మందిని ప‌ట్టుకున్నారు.

పోలీస్లు పట్టుకున్నవారిలో సంతోష్ దాబా ఓనర్, మ‌యూర్ పాన్ షాప్ ఓనర్‌తోపాటు బేగంబ‌జార్‌కు చెందిన స‌త్య ప్ర‌కాష్‌, బ‌హ‌ద్దూర్‌పురాకు చెందిన నౌషాద్ అలీ, ఓల్డ్ తోప్‌ఖానాకు చెందిన పుష్ప‌క్ జైన్‌, గ్యాన్ బాగ్‌కు చెందిన రాజ్‌కుమార్‌, రాంక‌పోట్‌కు చెందిన అలోక్ జైన్‌‌తోపాటు బ‌ర్క‌త్ పుర నివాసి పురుషోత్తంల‌ను సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని, వీరి వ‌ద్ద నుంచి రూ.73,860 న‌గ‌దు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.