టీం కూర్పులో మారని తీరు, సీనియర్ క్రికెటర్ లమనే ధీమా, టీంలో స్థానం సుస్థిరమనే ఉదాసీనతే ఈ ఓటమికి కారణమా? భారత్ సీనియర్ క్రికెటర్లు అర్ధం చేసుకోవలసినది ఏమంటే… ఏడాది చివరలో జరగబోయే T20 ప్రపంచ కప్ లో ఉదాసీనతకు తావు ఉండదు. నాకౌట్ పద్దతిలో జరిగే టోర్నీలో ఒక ఓటమి వల్ల కూడా నిష్క్రమించే పరిస్థితి. ప్రపంచంలో మేటి క్రికెటర్లు ఉన్నా తుది జట్టులో చోటు దక్కడం దాదాపు అసాధ్యం. ఈరోజు జరిగిన T20 మ్యాచ్ అందుకు ఉదాహరణ. 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయం చవి చూసిన భారత్ రెండవ T20లో అయినా ఫామ్ లో ఉన్న ఆటగాళ్లను జట్టులోకి తీసుకుని మెరుగైన ఆటను ప్రదర్శించాలి.

ఇక టీమ్‌ఇండియా నిర్దేశించిన 125 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్‌ కేవలం 15.3 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్లు జేసన్‌ రాయ్‌ (49; 32 బంతుల్లో 4×4, 3×6), జోస్‌ బట్లర్‌ (28; 24 బంతుల్లో 2×4, 1×6) శుభారంభాన్ని ఇచ్చారు. తరువాత వచ్చిన డేవిడ్‌ మలన్‌ (24; 20 బంతుల్లో 2×4, 1×6), జానీ బెయిర్‌స్టో (26; 17 బంతుల్లో 1×4, 2×6) మ్యాచ్‌ను ముగించారు. వీరంతా భారీ సిక్సర్లు, బౌండరీలతో చెలరేగారు. అంతకు ముందు భారత్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ (67; 48 బంతుల్లో 8×4, 1×6) అర్ధశతకం చేశారు.