ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కసారిగా కరోనా కేసులు పెరిగిపోయాయి. ఈ మధ్య కాలంలో వంద లోపుగానే నమోదు అవుతున్న కేసులు కాస్తా శుక్రవారం ఉన్నట్టుండి 200 మార్క్ ను దాటేశాయి. శుక్రవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 44,709 మందికి కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా, 210 కేసులు కేసులు నమోదు కాగా, రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,91,388కి చేరింది.


ఇక కృష్ణా జిల్లాలో కరోనా బారినపడి ఒకరు ప్రాణాలు కోల్పోవడంతో మరణించినవారికి సంఖ్య 7,180కి చేరింది. ఇక 140 మంది కోలుకోవడంతో, రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 8,82,981కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,227 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 85 కరోనా కేసులు నమోదు కాగా, విజయనగరం జిల్లాలో ఒక్క కేసు వచ్చింది. ఇటీవలే తిరుమలలో వేద పాఠశాలలో దాదాపు 40 మందికి పైగా విద్యార్థులకు కరోనా సోకిన విషయం తెలిసిందే. మొత్తం ఇప్పటివరకు రాష్ట్రంలో 1,44,48,650 కరోనా శాంపిల్స్ ను పరీక్షించినట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది.