జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

మహిళల సొమ్ము పొదుపు మార్గాలు

భారతదేశంలో ఎక్కువమంది గృహిణులకు ఆర్ధిక స్వాతంత్య్రం ఉండదు అయినా కూడా వారు ఇంటి ఖర్చులలో కొంత డబ్బును ఎలా ఆదా చేయాలో తెలిసి ఉంటారు. పొదుపు ఖాతాలలో చిన్నచిన్న మొత్తాలను దాచి పెట్టడం ద్వారా పెద్ద మొత్తాన్ని పోగు చేయాలని వారు భావిస్తుంటారు. ఇలాంటి చిన్న మొత్తాలలో పొదుపు చేయడం ద్వారా భవిష్యత్తులో ఏదైనా పెద్ద అవసరాలకు ఉపయోగపడుతుందని వారి భావన. అంతే కాకుండా ఆ డబ్బు ఏదైనా అవసరంలో కుటుంబానికి ఉపయోగించడం ద్వారా ఆర్ధిక శక్తి పొందినట్టుగా భావిస్తారు.

అయితే చాల మంది మహిళలకు ఎలా, ఎప్పుడు, ఎక్కడ దాచాలనే విషయం మీద స్పష్టమైన అవగాహన ఉండకపోవడంతో ఒక్కొక్కసారి మోసపోతుంటారు. అలాంటి వారికి సరైన మార్గంగా మ్యూచువల్‌ ఫండ్‌ లో పెట్టుబడి పెట్టడం బాగా ఉపయోగపడుతుంది.దీని వివరాలు ఏంటంటే… ప్రతి నెలా కొంత మొత్తాన్ని బ్యాంకులో దాచుకున్నట్లే, ఒక స్థిరమైన మొత్తాన్ని క్రమ పద్ధతిలో పెట్టుబడిగా పెట్టుకునే విధానాన్ని సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ (సిప్‌) అంటున్నారు. ఇది మంచి రాబడిని ఇస్తుందని కూడా నిపుణులు చెబుతున్నారు. ఈ ప్లాన్ ఎలా పనిచేస్తుందంటే… రోజు, నెల, సంవత్సరం ప్రాతిపదికన సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌లలో పెట్టుబడి పెడితే, మనం పెట్టిన పెట్టుబడిని మ్యూచువల్‌ఫండ్‌ కంపెనీలు వేర్వేరు సంస్థలలో ఇన్వెస్ట్‌ చేసి వాటిపై వచ్చే రాబడులను మదుపరులకు ఇస్తాయి. ఇది మిగిలిన మ్యూచువల్‌ ఫండ్స్‌కు కాస్త భిన్నమైనది.

ఈ వడ్డీ ఆధారిత పథకాలలో పెట్టుబడి పెడితే వడ్డీ లభిస్తుంది కానీ మదుపరుల డబ్బును వ్యక్తిగతంగా పెట్టుబడి పెట్టకుండా దీనికోసం ఒక ఫండ్‌ను సృష్టిస్తారు. ఈ మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడులను నిర్వహించే సంస్థలను అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీస్‌ (AMC) అని అంటారు. ఈ ఏఎంసీలు పెట్టుబడిదారులు పెట్టిన మొత్తాన్ని కలిపి ఒక నిధిని ఏర్పరుస్తాయి. ఈ నిధిని ఎక్కడ పెట్టుబడి పెట్టాలో నిర్ణయించే వ్యక్తిని ఫండ్‌ మేనేజర్‌ అంటారు. ఇలాంటి ఫండ్‌లలో ఒక్కొక్కరు ఒక్కో మొత్తాన్ని పెట్టుబడిగా పెడతారు. కొందరు రూ. 500 పెట్టుబడి పెట్టగలిగితే, కొందరు రూ. 5 లక్షల వరకు ఇన్వెస్ట్‌ చేయగలరు. ఫండ్‌ మేనేజర్‌ ఈ మొత్తం డబ్బును ఒకేసారి వేరు వేరు చోట్ల పెట్టుబడిగా పెట్టి, ఆ వచ్చే రాబడిని అందరికీ పంచుతారు. ఇలాంటి ఫండ్‌లలో ఇన్సూరెన్స్‌, మెడిక్లెయిమ్‌ లాంటి సౌకర్యాలు ఉండవు.

మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడులు పెట్టే వారికోసం అనేక పథకాలు ఉంటాయి. అన్నిటిలో మీకు వీలు అయిన స్కీమ్, లేదా నిపుణులు సూచించిన పథకాలను ఎంచుకోవచ్చు. వాటి నెట్‌ అసెట్‌ వ్యాల్యూ (NAV) రూపంలో ఫండ్లలో పెట్టిన పెట్టుబడి విలువను కంపెనీలు ప్రకటిస్తాయి.

ఇక మ్యూచువల్‌ ఫండ్ల మీద అవగాహన లేని వాళ్ళు వీటిలో పెట్టుబడి పెట్టడానికి పెద్ద మొత్తాలు ఉండాలి అనే భ్రమలో ఉంటారు కానీ నిజానికి మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడులు పెట్టడానికి పెద్ద మొత్తాలే ఉండాల్సిన అవసరం లేదు. రూ.500 కూడా ప్రారంభించవచ్చు. సమయం కూడా మీకు నచ్చినట్టు ఎంచుకోవచ్చు. అంటే రోజు, నెల, మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరం లేదంటే ఒకేసారి (వన్‌టైమ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌) కూడా పెట్టుబడి పెట్టవచ్చు. మీరు సాధారణ పొదుపు పథకాలలో పెట్టుబడి పెడితే రాబడి తక్కువ ఉండొచ్చు కానీ మ్యూచువల్‌ ఫండ్లు అందుకు భిన్నంగా మంచి ఆదాయాన్ని ఇస్తాయని ఆర్డీ ఇన్వెస్ట్‌మెంట్‌ డైరక్టర్‌ రాజేశ్‌ రోషన్‌ అన్నారు.

మ్యూచువల్‌ ఫండ్స్‌లో గృహిణులే కాకుండా చిన్న చిన్న చేతి వృత్తులు, చిన్న పనులు చేసుకునే మహిళలు ఎవరైనా కూడా పెట్టుబడి పెట్టొచ్చు దానికోసం ఎవరి మీద ఆధారపడవలసిన అవసరమే లేదు. అంతే కాకుండా రిటైరైన మహిళలు కూడా భవిష్యత్తు కోసం పెట్టుబడులకు ఇప్పుడు ఆసక్తి చూపుతున్నారు.

ఎవరైనా తమ పెట్టుబడి మొత్తం ఒకే సంస్థలో ముడుపు చేయడం వల్ల లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. అవి ఏంటంటే మీరు మీ పెట్టుబడిని కేంద్రీకృతం చేసిన సంస్థ నష్టపోయినట్టైతే మీ పెట్టుబడి కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. ఒకేచోట పొదుపు చేయడం వల్ల వడ్డీతోపాటు ద్రవ్యోల్బణం రేటు కూడా పెరుగుతుంది. చార్టర్డ్‌ అకౌంటెంట్‌గా పని చేస్తున్న రచనా రనడే ప్రకారం “అలాంటి సందర్భంలో పొదుపు పథకాలతో లాభం తక్కువ. మ్యూచువల్‌ ఫండ్స్‌ ఎక్కువ రాబడినిస్తాయి. అయితే రిస్క్‌, ప్రాఫిట్‌లను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా పెట్టుబడి పెట్టాలి” అని అన్నారు. సెబీ ప్రకారమే మ్యూచువల్ ఫండ్ కంపెనీలు పనిచేస్తాయి. మ్యూచువల్ ఫండ్ లో మూడు రకాలు ఉన్నాయి వీటిలో ఒక్కొక్క వ్యక్తికీ ఒక్కొక్క రకమైన మ్యూచువల్ ఫండ్ వర్తిస్తుంది అది ఎవరికీ వారు జాగ్రత్తగా అలోచించి ఎంపిక చేసుకోవాలి.

1 . ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ :

ఇది స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతుంది. మార్కెట్‌ హెచ్చుతగ్గుల ఆధారంగా రాబడి ఉంటుంది. వీటిలో రిస్క్‌ ఎక్కువ. ప్రయోజనం కూడా ఎక్కువగా ఉండొచ్చు. దీర్ఘకాలిక పద్దతిలో పెట్టుబడి పెట్టేవారికి ఇది మంచి ఆప్షన్‌. అంటే ఇప్పటికిప్పుడు
డబ్బు అవసరం లేని వారు ఐదు, ఆరు సంవత్సరాల ప్రాతిపదికన పెట్టుబడిగా పెట్టవచ్చు. అసలు మ్యూచువల్ ఫండ్ లోనే ఎందుకు పెట్టాలి? మనం సొంతంగా మార్కెట్ లో పెట్టొచ్చు కదా అనే సందేహం వస్తుంది కానీ మ్యూచువల్‌ ఫండ్లు మన డబ్బును మార్కెట్‌లో పెట్టుబడిగా పెట్టే విధానం భిన్నంగా ఉంటుంది. మీ దగ్గర డబ్బు తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ సురక్షితమని భావించే కంపెనీలలో పెట్టుబడి పెట్టలేరు. కానీ మ్యూచువల్‌ ఫండ్ల ద్వారా అలా చేయవచ్చు. అవి మీ డబ్బును పెద్ద ఫండ్‌లలో ఇన్వెస్ట్‌ చేస్తాయి. తద్వారా మీరు లాభం పొందొచ్చు.

2 . డెట్‌ మ్యూచువల్‌ ఫండ్:

ఇలాంటి ఫండ్‌లు మన సొమ్మును బాండ్లు, గవర్నమెంట్‌ సెక్యురిటీ, ట్రెజరీ బిల్‌, నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్లలో పెట్టుబడులు పెడతారు. ఇందులో స్వల్పకాలిక, దీర్ఘకాలిక ఆప్షన్లు ఉంటాయి. స్వల్పకాలిక పెట్టుబడుల పద్ధతిలో రోజు ప్రాతిపదికన కూడా పెట్టుబడి పెట్టవచ్చు. దీనిని ఓవర్‌నైట్ ఫండ్ అని కూడా అంటారు. కానీ ఇక్కడ లాభాలు ఎక్కువగా ఉండవు, అలాగే రిస్క్‌ కూడా తక్కువగా ఉంటుంది. ఇందులో ఫిక్స్‌డ్‌ రిటర్న్‌లతోపాటు డబ్బు నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక ఇందులోనే
లాంగ్‌టర్మ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ చేయాలనుకుంటే ఈక్విటీ ఫండ్లలో పెట్టుబడులు పెట్టవచ్చు. కాని డెట్‌ ఫండ్స్ తక్కువ సమయంలో సురక్షితమైన పెట్టుబడికి మంచి ఆప్షన్‌.
“పన్ను మినహాయింపుల కోసం కూడా మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టవచ్చు. వీటినే టాక్స్‌ సేవర్‌ ఫండ్‌ అంటారు. ఇది ఈక్విటీ ఓరియెంటెడ్ మ్యూచువల్ ఫండ్. అంటే కనీసం 65శాతం డబ్బు ఈక్విటీ ఫండ్లలో పెట్టుబడి పెట్టబడుతుంది. మిగిలిన 35శాతం డెట్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టబడుతుంది. రచనా రనడే ప్రకారం మూడు సంవత్సరాల లాక్-ఇన్‌ వ్యవధి ఉంటుంది. అయితే, పెట్టుబడిని ఎక్కడ నష్టపోతామోనని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఫండ్‌ మేనేజర్‌ చూసుకుంటారు”.

3 . హైబ్రిడ్‌ మ్యూచువల్‌ ఫండ్ :

ఇది ఈక్విటీ, డెట్‌ మ్యూచువల్‌ ఫండ్‌ల మిశ్రమం. ఇందులో రెండు విధాలుగా పెట్టుబడి పెట్టవచ్చు. మీ డబ్బులో కొంత షేర్లు, మరికొంత బాండ్లలో పెట్టుబడి పెట్టాలనుకుంటే హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్లను ఎంచుకోవచ్చు. ఇందులో నష్ట భయం, రాబడి ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లకంటే తక్కువ, డెట్‌ మ్యూచువల్‌ ఫండ్లకంటే ఎక్కువగా ఉంటుంది. మ్యూచువల్‌ ఫండ్లు జారీ చేసే గోల్డ్‌ఫండ్‌లలో కూడా పెట్టుబడి పెట్టవచ్చు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.