జాతీయం (National) వార్తలు (News)

భోజన సేవలు నిషేధించిన కేంద్ర పౌరవిమానయాన శాఖ

దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర పౌరవిమానయాన శాఖ ఏప్రిల్‌ 15 నుంచి తక్కువ దూరం ప్రయాణించే విమానాల్లో భోజనసేవలలను నిలిపివేసింది. గతేడాది విధించిన లాక్‌డౌన్‌తో కేంద్రం దేశీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకలను నిలిపివేసిన తర్వాత మే 25 నుంచి దశల వారీగా ఈ సేవలను పునరుద్ధరించినా కానీ దేశీయ విమానాల్లో భోజన సేవలను అనుమతించలేదు. ప్రయాణికులు సొంతంగా ఆహారపదార్థాలను కూడా తీసుకురావొద్దని పేర్కొంది. ఆగస్టు 31 తర్వాత కొన్ని షరతులతో ఈ భోజన సదుపాయాలను మళ్లీ అందుబాటులోకి తెచ్చింది.

ఇటీవల కొద్ది రోజులుగా దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో భోజన సేవలపై పౌర విమానయాన శాఖ నేడు సమీక్ష నిర్వహించి రెండు గంటల కంటే తక్కువ సమయం ప్రయాణించే విమానాల్లో ఈ సేవలపై నిషేధం విధించింది. ‘‘దేశీయంగా విమాన సేవలు అందించే ఎయిర్‌లైన్లు రెండు గంటలు అంతకంటే ఎక్కువ సమయం ప్రయాణించే విమానాల్లో మాత్రమే భోజన సేవలను అందించాలి’’ అని దేశాలు జారీ చేసింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.