దేశ అత్యున్నత న్యాయస్థానంపై కూడా కరోనా పంజా విసిరింది. సుప్రీంకోర్టులో ఇప్పటి వరకు దాదాపు 50శాతం మంది సిబ్బంది కొవిడ్‌ బారినపడినట్లు, శనివారం ఒక్కరోజే 44 మంది సిబ్బందికి పాజిటివ్‌గా తేలడంతో న్యాయమూర్తులు మళ్లీ వర్చువల్‌ విధానంలో కేసుల విచారణ చేపట్టనున్నట్లు సుప్రీం వర్గాలు వెల్లడించాయి. అనేక మంది సిబ్బంది, లా క్లర్కులకు కరోనా సోకడంతో న్యాయమూర్తులు కేసుల విచారణ ఇంటి వద్ద నుంచే వర్చువల్‌గా చేపట్టనున్నట్లు, కోర్టు హాళ్లు పరిసరాలను శానిటైజ్‌ చేస్తున్నట్లు తెలిపాయి.