ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 14వ సీజన్ నాలుగవ మ్యాచ్ లో మరో ఆసక్తికర పోరుకు సమయం ఆసన్నమైంది. నేడు పంజాబ్‌ కింగ్స్‌తో రాజస్థాన్ రాయల్స్ తలపడనుండగా రాజస్థాన్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పంజాబ్ కెప్టెన్ రాహుల్ మాట్లాడుతూ
తాను టాస్ గెలిచినా ఫీల్డింగ్ నే ఎంచుకునేవాడినని టాస్ గెలిచినా, ఓడినా పెద్ద తేడా ఉండదని తాము కూడా బాగా ఆడాలనే విషయాన్నే దృష్టిలో పెట్టుకున్నామని తమ ఫ్రాంచైజీ చేసిన కొనుగోళ్ల విషయంలో కూడా సంతోషంగా ఉన్నామనీ అన్నారు. ఇక తొలిసారిగా జట్టులోకి షారూఖ్ ఖాన్, జ్యే రిచర్డ్‌సన్, రైలీ మెరిడిత్, అర్షదీప్ సింగ్‌లను తీసుకున్నట్లు తెలిపారు. టాస్ అనంతరం శాంసన్ మాట్లాడుతూ వేలంలో తాము మంచి ఆటగాళ్లను కొనుగోలు చేశామని, విదేశీ ఆటగాళ్లైన మోరిస్, స్టోక్స్, బట్లర్, ముస్తాఫిజుర్ రెహ్మాన్‌లను తుది జట్టులోకి తీసుకున్నామని తెలిపారు.

పంజాబ్‌ జట్టు: కేఎల్ రాహుల్‌(కెప్టెన్‌), మురుగన్‌ అశ్విన్‌, మయాంక్‌ అగర్వాల్‌, అర్ష్‌దీప్‌ సింగ్, నికోలస్‌ పూరన్‌, దీపక్‌ హూడా, షారుఖ్‌ ఖాన్‌, జై రిచర్డ్‌సన్‌, మహ్మద్‌ షమి, క్రిస్‌గేల్‌, రిలే మెరెడిత్‌.‌

రాజస్థాన్‌ జట్టు: జోస్‌ బట్లర్‌, బెన్‌స్టోక్స్‌, సంజూ శాంసన్‌(కెప్టెన్‌), ముస్తాఫిజుర్‌ రహ్మాన్, రియాన్‌ పరాగ్‌, శివమ్‌ దూబె, రాహుల్‌ తెవాతియా, క్రిస్‌ మోరిస్‌, శ్రేయస్‌ గోపాల్‌, చేతన్‌ సకారియా, మనన్‌ వోహ్రా.