వార్తలు (News)

ఆస్పత్రి మనుషులకా?? ఎలుకలకా??

ఆంధ్రప్రదేశ్ లో అనంతపురం జిల్లా ప్రభుత్వాస్పత్రి అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. అక్కడ ఆస్పత్రిలో రోగులు కొత్త సమస్య అనుభవిస్తున్నారు. ఆర్థో విభాగం ఆపరేషన్ థియేటర్‌లో రోజుకు పదుల సంఖ్యలో శస్త్ర చికిత్సలు జరుగుతాయి. దానితో అధునాతన యంత్రాలు ఏర్పాటు చేశారు. అలాంటి చోటకు ఎలుకలు వచ్చి ఇక్కట్లు కలిగిస్తున్నాయి. ఆర్థో విభాగం ఆపరేషన్ థియేటర్‌లో విద్యుత్ బోర్డు ప్యూజ్‌లోకి వెళ్లిన ఎలుక షాక్‌తో చనిపోయింది.

ఆరు నెలలుగా ఎలుకలు థియేటర్‌లోకి ప్రవేశించి విద్యుత్ వైర్లతోపాటు యంత్రాలకు సంబంధించిన వైర్లను కొరికేయడంతో యంత్రాలు పనిచేయకుండా పోతున్నాయని, ఆపరేషన్ చేస్తున్న సమయంలో ఎలుకలు కారణంగా యంత్రాలు పనిచేయకుండాపోతే పరిస్థితి ఏంటని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలుకల వ్యవహారంపై అలజడి రేగడంతో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావు పరిస్థితిని సమీక్షించి చర్యలు తీసుకుంటామన్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.