ఎల్‌జీ వింగ్‌ స్మార్ట్‌ఫోన్ 40వేల తగ్గింపుతో 29,999 రూపాయలకు ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి రానుంది. కేవలం భారతదేశంలో ఏప్రిల్ 13 నుండి అరోరా గ్రే, ఇల్యూజన్ స్కై కలర్ ఆప్షన్లలో లభ్యం కానుంది.

ఆకర్షణీయమైన ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను 69,990ధర వద్ద గత ఏడాది అక్టోబర్‌లో లాంచ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఎల్‌జీ మొబైల్ వ్యాపారం నుంచి పూర్తిగా వైదొలగనున్న తరుణంలో స్టాక్‌ ఉన్నంత వరకు తన ఉత్పత్తులను విక్రయించే ఆలోచనలో సంవత్సరం జూలై 31 నాటికి పూర్తిగా మొబైల్‌ మార్కెట్‌నుంచి వైదొలగాలనే ఉద్దేశ్యంతో ఈ భారీ తగ్గింపును కంపెనీ ప్రకటించింది.

ఎల్‌జీ వింగ్ కాన్ఫిగరేషన్ వివరాలు:
6.8 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ 10
2440 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 765జి ప్రాసెస‌ర్‌
8జీబీ ర్యామ్‌ 128 జీబీ స్టోరేజ్
2 టీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌
64+13+12 మెగాపిక్స‌ల్ రియర్‌ కెమెరా
32 ఎంపీ సెల్ఫీ కెమెరా
4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ