వార్తలు (News)

సినిమా టికెట్ ధరలు పెంచే అవకాశం లేదు!

వకీల్ సాబ్ సినిమా రిలీజ్ తర్వాత ఆంధ్ర ప్రదేశ్ లో సినిమా టికెట్ లపై పెద్ద దుమారమే రేగింది. ఇకపై ఆంద్ర ప్రదేశ్ లో ఏ సినిమాకైనా, ఏరోజైనా టికెట్ ధర ఒకేలా ఉంటుందని, పెంచుకోడానికి వీలు లేకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంది. తమ అభిమాన కథానాయకుడి సినిమాను తొలి రోజే చూడాలన్న అభిమానాన్ని ‘క్యాష్‌’ చేసుకోవాలనుకున్న సినిమా వాళ్ల అత్యాశ కొద్దీ ఆ బలహీనతను సొమ్ము చేసుకోవటానికి ఆ రెండు మూడు రోజులూ కొన్ని సినిమాల రేట్లను నాలుగైదు రెట్లు పెంచడం జరుగుతూ ఉంది. దీంతో పేదల జేబులకు చిల్లులు పడుతుండడంతో ఎవరి సినిమా అయినా.. ఏ రోజైనా.. టికెట్‌ ధర మాత్రం ఒకటే ఉండాలన్న నిబంధన ప్రభుత్వం తీసుకొచ్చింది.
తొలి మూడు రోజులు అదనపు పాటలు, సీన్ల వంటివేమీ ఉండవు. మరి అలాంటప్పుడు తొలి మూడు రోజులూ టికెట్ల ధరలు పెంచటం ఎందుకు అన్న సగటు ప్రేక్షకుడి ప్రశ్న సబబే అని ప్రభుత్వం ఏకీభవించింది. ఎక్కువ ఖర్చు పెట్టి సినిమా తీశామని, నటీ నటులకు ఎక్కువ పారితోషికం ఇచ్చామని తదితర కారణాలతో టికెట్ల రేట్లు పెంచుతామంటే ఇకపై కుదరదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

అధికారిక బ్లాక్‌ను నిరోధించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు.. ఇలా ప్రాంతాల వారీగా టికెట్లకు ధరలు నిర్దేశించిందని, ఇవి అన్ని సినిమాలకూ… అన్ని రోజులూ అమలవుతాయని స్పష్టం చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఇప్పుడు తాజాగా హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ కూడా దీన్ని సమర్థించిన నేపథ్యంలో ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.