భారత్‌లో రోనా కేసులు పెరుగుతుండటం, వివిధ రాష్ట్రాల్లో వ్యాక్సిన్‌ కొరత ఉండటంతో మరో ఐదు వ్యాక్సిన్లకు అనుమతి ఇవ్వాలని కేంద్రం భావించి రష్యా అభివృద్ధి చేసిన చేసిన ‘స్పుత్నిక్‌-వి’ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగం కోసం కేంద్ర నిపుణుల కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఇందులో భాగంగా త్వరలోనే టీకా ఉత్పత్తి చేసి, వినియోగంలోకి తీసుకురానున్నారు. డీజీసీఐ అనుమతి లభిస్తే, దేశంలో సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, ఆక్స్‌ఫర్డ్‌ ఆస్ట్రాజెనికా కొవిషీల్డ్‌, భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ తర్వాత అనుమతి లభించిన మూడో వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌ అవుతుంది.
‘స్పుత్నిక్‌ వి’ టీకాపై మనదేశంలో రెండు, మూడో దశ క్లినికల్‌ పరీక్షలను ఇటీవలే ఆ సంస్థ నిర్వహించింది. ఆ పరీక్షల భద్రత, ఇమ్యునోజెనిసిటీ సమాచారాన్ని ఇప్పటికే భారత ఔషధ నియంత్రణ మండలికి డాక్టర్‌ రెడ్డీస్ అందచేసి టీకా ఉత్పత్తి, అత్యవసర వినియోగానికి అనుమతులు మంజూరు చేయాలంటూ దరఖాస్తు చేసుకుంది.