వార్తలు (News)

పలు రాష్ట్రాల్లో వరుసగా ఐదు రోజులు బ్యాంకుల శలవు!!

పలు రాష్ట్రాల్లో వరుసగా ఐదు రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు. ఎందుకంటే శనివారం సెకండ్ సాటర్ డే, ఆదివారం శలవు. అయితే భువనేశ్వర్, ఇంఫాల్ ప్రాంతాల్లో రథయాత్ర సందర్భంగా సోమవారం (12జూలై) సెలవుదినం కాగా మంగళవారం జూలై 13న భాను జయంతి కారణంగా, బుధవారం 14న దృక్ప శ్రేష్ఠి కారణంగా గ్యాంగ్‌టక్‌లో సెలవు. జూలై 16నహరేలా ఫెస్టివెల్ సందర్భంగా ఉత్తరాఖండ్‌లో బ్యాంకులు శలవు.

ఇక జూలై 17 తేదీన అగర్తాలా, షిల్లాంగ్‌లో బ్యాంకులు క్లోజ్ అవుతాయి. ఇక్కడ అగర్తాలలో యూ టిరోట్ సింగ్ డే, షిల్లాంగ్‌లో ఖార్చీ పూజ సందర్భంగా సెలవు రోజు. జూలై 19న సిక్కింలో గురు రింపోచీ సందర్భంగా బ్యాంకులు తెరుచుకోవు.

పలు రాష్ట్రాల్లో వరుసగా ఐదు రోజుల పాటు బ్యాంకులకు సెలవు దినం. నిన్న శనివారం సెకండ్ సాటర్ డే, నేడు ఆదివారం కారణంగా బ్యాంకులు క్లోజ్ ఉంటాయి. అయితే భువనేశ్వర్, ఇంఫాల్ ప్రాంతాల్లో రథయాత్ర సందర్భంగా సోమవారం (12జూలై) సెలవుదినం.

జూలై 20వ తేదీన బక్రీద్ సందర్భంగా జమ్ము, కొచ్చి బ్యాంకులకు సెలవు ఉంటుంది. 21 జూలై కొచ్చి, తిరువనంతపురం, భువనేశ్వర్ మినహా దేశవ్యాప్తంగా బ్యాంకులు క్లోజ్ ఉంటాయి. కేర్ పూజ ఉన్నందున జూలై 31న అగర్తాలలో బ్యాంకులకు సెలవు ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉండే పండుగ/సెలవు రోజున దేశమంతా ఒకేరోజు బ్యాంకులకు సెలవు ఉంటుంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల పండుగలను బట్టి శలవులు మారుతూ ఉంటాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •