వార్తలు (News)

పొలంలో వజ్రం.. రాత్రికి రాత్రే లక్షలు!!

రాయలసీమ భూముల్లో రత్నాలు, వజ్రాలు పొదిగి ఉన్నాయని ప్రశస్తి! వర్షాకాలం సమీపించిందంటే స్థానికులు ఖాళీగా ఉన్న భూములు, పొలాల్లో రత్నాల కోసం వెతకడం ప్రారంభించారు.

ఈ క్రమంలో తాజాగా కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో ఓ వ్యక్తికి వజ్రం దొరకడంతో ఈ విషయం తెలుసుకున్న ఓ వ్యాపారి రూ.3 లక్షలు చెల్లించి అతని నుంచి వజ్రాన్ని కొనుగోలు చేశాడు. బహిరంగ మార్కెట్లో దీని విలువ రూ.12లక్షలు ఉంటుందని సమాచారం. అయితే, నెలరోజుల వ్యవధిలో అక్కడ దాదాపు రూ.5 కోట్ల విలువైన వజ్రాలు లభ్యమైనట్లు తెలుస్తోంది.దీంతో రాత్రికి రాత్రే ఆ వ్యక్తి లక్షాధికారి అయ్యారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •