వార్తలు (News)

పాక్‌లో కరోనా నాలుగో వేవ్ మొదలైందా??

పాకిస్థాన్‌లో నాలుగో వేవ్ మొదలైంది. మూడు వారాల నాటి లెక్కలతో పోలిస్తే ప్రస్తుతం అక్కడ రోజువారి కరోనా కేసుల సంఖ్య ఏకంగా మూడు రెట్లు పెరిగింది. జూన్ 21న అక్కడ రోజువారి కేసుల సంఖ్య 663గా ఉండగా గత 24 గంటల్లో అక్కడ కొత్తగా 1920 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల కాలంలో ప్రభుత్వం కరోనా ఆంక్షలకు సడలింపులు ప్రకటించడంతో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.

పరీక్షలు నిర్వహిస్తే కేసుల పెరుగుదల తప్పదని అప్పట్లోనే నిపుణులు హెచ్చరించినా కూడా ఇమ్రాన్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. దేశంలో చేపడుతున్న వ్యాక్సిన్ కార్యక్రమం ద్వారా కరోనాను ఎదుర్కోగలమని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ధీమాగా ఉన్నట్టు అక్కడి పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజలు తమంతట తాముగా ముందుకు వచ్చి టీకా వేయించుకోవాలని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేశారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •