వార్తలు (News)

కేరళ లో కొత్తగా 3 జికా వైరస్ కేసులు!!

కేరళలో మరో మూడు జికా వైరస్‌ కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో 46 ఏళ్ల వ్యక్తి, 29 ఏళ్ల హెల్త్‌ వర్కర్‌తోపాటు 22 నెలల వయసున్న చిన్నారి ఉంది. దీనితో మొత్తం రాష్ట్రంలో నమోదైన జికా కేసుల సంఖ్య 18కి చేరింది.

జికా వైరస్‌ అంశంపై కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌ మాట్లాడుతూ.. జికా వైరస్‌ టెస్టింగ్‌ కోసం తిరువనంతపురం, త్రిస్సూర్‌, కొజికోడ్‌ మెడికల్‌ కాలేజీల్లో, అలప్పీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీలో ల్యాబ్‌లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మరిన్ని టెస్టింగ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •