వార్తలు (News)

పెట్రోల్ ధర పెరుగు.. డీజిల్ ధర తరుగు!!

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. ఈ పెరుగుదల అనేది సర్వ సాధారణం ఐపోయింది. గతంలో ఏడాదిలో రెండు మూడు సార్లు మాత్రమే పెరిగే చమురు ధరలు నేడు సంవత్సరంలో రెండు మూడు రోజులు మాత్రమే పెరగకుండా ఉండే పరిస్థితి వచ్చేసింది. ఈ నెలలో ఆదివారం కాస్త బ్రేక్ ఇచ్చినట్టే ఇచ్చి విక్రయ సంస్థలు నేడు మళ్లీ పెట్రోల్‌ ధరలను పెంచాయి అయితే డీజిల్‌ ధరను మాత్రం ఈ ఏడాదిలో తొలిసారి తగ్గించింది.

లీటర్‌ పెట్రోల్‌పై సోమవారం గరిష్ఠంగా 30 పైసలు పెంచి లీటర్‌ డీజిల్‌పై 16 పైసల వరకు తగ్గించారు. దీంతో దేశ రాజధాని దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.101.19, డీజిల్‌ ధర రూ.89.72గా ఉంది. వాణిజ్య రాజధాని ముంబయిలో పెట్రోల్‌ రూ.107.20, డీజిల్‌ రూ.97.29కి చేరాయి.

కరోనాతో అన్ని రంగాలూ కుదేలై ప్రజల ఆదాయ స్థాయిలు పడిపోయినా.. కేంద్రం మాత్రం ఈ రెండు ఇంధనాలపై పన్నుల భారాన్ని మరింత పెంచింది. గతేడాది మార్చి వరకూ (2020 మార్చి 14 ముందు) ఉన్న పన్నును పరిశీలిస్తే లీటరు డీజిల్‌పై రూ.16 వరకు, పెట్రోలుపై రూ.13 మేర భారం పెరిగింది.

నగరం   పెట్రోల్‌ డీజిల్‌
హైదరాబాద్‌   105.15   97.78
కోల్‌కతా 101.35      92.81
బెంగళూరు  104.58    97.79
భోపాల్‌ 109.53    98.50
చెన్నై 101.91    97.80
close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •