జాతీయం (National) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

బ్యాంకులకు ఆర్‌బీఐ కీలక ఆదేశం!!

కీలక విధుల్లో ఉన్న ఉద్యోగులకు ఏటా తప్పనిసరిగా శలవులు మంజూరు చేయాలనీ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) అన్ని బ్యాంకులను ఆదేశించింది. పది రోజులకు తక్కువ కాకుండా వారికి సెలవులు మంజూరు చేయాలని, ఈ విషయంలో ఉద్యోగులు ఆశ్చర్యపోయేలా ముందస్తు సెలవులపై ఎటువంటి సమాచారం వారికి ఇవ్వకూడదని కూడా ఆర్‌బీఐ పేర్కొంది. సవరించిన రిస్క్ మేనేజ్‌మెంట్ మార్గదర్శకాల్లో భాగంగా ఆర్‌బీఐ శుక్రవారం నాడు ఓ సర్క్యులర్‌ను జారీ చేస్తూ సెలవులో ఉన్న వారికి ఉద్యోగ బాధ్యతలకు సంబంధించి ఎటువంటి సమాచారం అందకుండా చూడాలని కూడా ఆర్‌బీఐ తెలిపింది. అయితే బ్యాంకుల అంతర్గత వ్యవహారాలు, ఇతర కార్పొరేట్ ఈ-మెయిళ్లకు మటుకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ ఆదేశాలు అన్ని బ్యాంకులకు వర్తిస్తాయని, ఈ సర్క్యులర్ అందిన ఆరు నెలలలోగా బ్యాంకు మేనేజ్‌మెంట్ ఈ నిబంధనలను అమలు చేయాలని ఆర్‌బీఐ ఆదేశించడం కొసమెరుపు!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •