అంతర్జాతీయం (International) వార్తలు (News)

సరదా కాస్తా ప్రాణాంతకంగా మారిన వైనం!!

చిన్న పిల్లలు ఎవరైనా ఎగ్జిబిషన్కి వెళ్తే రంగుల రాట్నం ఎక్కడానికి ఎంతో ఇష్టపడతారు.
అంతెత్తున పైకి తీసుకెళ్లి.. కిందకు తీసుకురావడంతో పిల్లలు, పెద్దలైనా మురిసిపోతారు. కానీ కొందరైతే సరదాగా రంగుల రాట్నం ఎక్కినా.. ఎక్కడ కిందపడిపోతామో అని భయంతో వణికిపోతారు. ఇక నిజంగానే రంగుల రాట్నంలో ఏదో లోపం తలెత్తి అది లెక్కలేకుండా తిరుగుతుంటే! ఊహించాలంటే భయమేస్తుంది కదా! తాజాగా అమెరికాలోని మిచిగాన్‌లో జరిగిన నేషనల్ చెర్రీ ఫెస్టివల్లో అటువంటి ఘటన వెలుగుచూసింది. మ్యాజిక్ కార్పెట్ రైడ్ మధ్యలో స్పిన్‌ యంత్రం నియంత్రణ కోల్పోయింది. గుడ్రంగా తిరుగుతూ రంగుల రాట్నంలో ఉన్నవారు. కింద ఉన్న వారి బంధువులు, కుటుంబ సభ్యులను బెంబేలెత్తించింది. వారి అరుపులతో ఆ ప్రాంతమంతా గందరగోళమైంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •