అంతర్జాతీయం (International) టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

2000 ఓడలు 75 విమానాలు మాయం చేసిన బెర్ముడా ట్రయాంగిల్‌ రహస్యం??

ప్రపంచంలో అంతు చిక్కని రహస్యాలలో బెర్ముడా ట్రయంగిల్ మొదటి వరుసలో ఉంటుంది. శాస్త్రవేత్తల మేధస్సుకు పరీక్ష పెట్టిన ఈ బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ గుట్టు ఎట్టకేలకు విప్పారు. అక్కడికి రాగానే నౌకలు, విమానాలు ఎందుకు అదృశ్యమవుతున్నాయో వివరించారు.

శతాబ్దాలుగా అంతుచిక్కని ఈ రహస్యానికి అక్కడ ఏర్పడే షడ్భుజాకార మేఘాలే కారణమని, గంటకు 273 కిలోమీటర్ల వేగంతో కదిలే ఆ ప్రాంతలోని మేఘాలు ఎయిర్ బాంబ్స్‌ తో అనుసంధానమై ఉన్నాయని, వాటి వల్ల బెర్ముడా ట్రయాంగిల్ వద్ద పెను తుపాను వంటి గాలి తీవ్రత ఏర్పడడం వల్ల విమానాలు, నౌకలు నీటిలో మునిగిపోతున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. రాడార్ శాటిలైట్ ఇమేజరీని ఉపయోగించి ఈ విషయాన్ని కనుగొన్నట్టు ర్యాండీ అనే శాస్త్రవేత్త తెలిపారు.

దాదాపు 1000 సంవత్సరాలలో ఇక్కడ 1000 మంది మరణించినట్లుగా అంటే ప్రతి సంవత్సరం నాలుగు విమానాలు 20 నౌకలు తప్పిపోతుంటాయి. 1945లో యుఎస్ నావికాదళానికి చెందిన ఐదు అవెంజర్ టార్పెడో బాంబర్లు 90 నిమిషాల్లోనే అదృశ్యమయ్యాయి.ఎట్టకేలకు దీని మిస్టరీ వీడింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •