వార్తలు (News)

లాభాల నుండి నష్టాల్లోకి జారుకున్ననేటి మార్కెట్లు!!

నేటి ఉదయం దేశీయ స్టాక్‌ మార్కెట్‌ లు లాభాలతో ప్రారంభం కావడం ఈ వారానికి శుభసూచకంగా భావించినప్పటికీ మధ్యాహ్నం భోజన సమయానికి ప్రారంభలాభాలన్నీ ఆవిరి అయిపోయాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 52,700 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకి తిరిగి 52,208 వద్ద కనిష్ఠాన్ని చవిచూసి చివరికి 13 పాయింట్లు నష్టపోయి 52,372 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా ఇదే బాటలో నడిచి 02 పాయింట్ల స్వల్ప లాభంతో 15,692 వద్ద ముగిసింది.

బీఎస్‌ఈ 30 సూచీలో యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్‌, డాక్టర్ రెడ్డీస్‌, రిలయన్స్‌, మారుతీ షేర్లు లాభాల్లో ముగిస్తే.. పవర్‌ గ్రిడ్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టాటా స్టీల్‌, బజాజ్‌ ఆటో, హెచ్‌యూఎల్‌, నెస్లే ఇండియా షేర్లు నష్టాలు చవిచూశాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •