వార్తలు (News)

పట్టాలెక్కనున్న విశాఖ-కాచిగూడ ఎక్స్‌ప్రెస్..!!

విశాఖ-కాచిగూడ ఎక్స్‌ప్రెస్ రైలు ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్నట్టు ఈస్ట్ కోస్ట్ రైల్వే తెలిపింది. ప్రయాణికుల నుంచి ఆదరణలేని కొన్ని రైళ్లను రైల్వే ఇటీవల రద్దు చేయగా, అందులో విశాఖపట్టణం-కాచిగూడ రైలు కూడా ఉంది. అయితే, ప్రస్తుతం మళ్లీ పరిస్థితులు సాధారణ స్థాయికి చేరుకుంటూ ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండడంతో దానిని మళ్లీ పట్టాలెక్కిస్తోంది.

గురువారం సాయంత్రం 6:40 గంటలకు రైలు విశాఖలో బయలుదేరి శుక్రవారం ఉదయం 7:25 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. 16న సాయంత్రం 6:25 గంటలకు కాచిగూడలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6:50 గంటలకు విశాఖ చేరుకుంటుంది. దువ్వాడ, అనకాపల్లి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, రాయనపాడు, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్, కాజీపేట, మల్కాజిగిరిలలో ఆగుతుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •