అంతర్జాతీయం (International) వార్తలు (News) వినోదం

దశాబ్దాలుగా నీటి లోపల మరుగున పడిన గ్రామం!!

ఇటలీలోని ఒక రిజర్వాయర్​‌ అడుగున కొన్ని దశాబ్దాల క్రితమే నీటిలో మునిగిపోయిన ఒక గ్రామం ఆనవాళ్లు బయటపడ్డాయి. ఉత్తరాన ఉండే రేసియా సరస్సు, దాని మధ్యలో ఉండే చర్చి టవర్ చూడ్డానికి చాలా అందంగా ఉంటాయి. అయితే రిజర్వాయర్​‌‌ మరమ్మత్తుల కోసం సరస్సులోని నీటిని వదిలేయడంతో క్యురన్​ అనే గ్రామం ఆనవాళ్లు కనిపించాయి. ఒకప్పుడు ఈ గ్రామంలో వందలాది మంది నివసించేవారు కానీ 1950లో హైడ్రోఎలక్ట్రిక్​ ప్లాంట్​ను నిర్మించడం వల్ల వరద నీరు చేరి క్యురన్​ గ్రామం నీట మునిగింది.

1950లో ఒక రిజర్వాయర్​ను నిర్మించాలని, దగ్గర్లోని రెండు సరస్సులను కలపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతో ప్రజలకు ఇష్టం లేకపోయినా క్యురన్​ గ్రామం నీట మునగాల్సిన పరిస్థితి వచ్చింది.దాదాపు 160 ఇళ్లు నీట మునిగాయి. క్యురన్ ప్రజలు నిర్వాసితులయ్యారు. కొందరు కొత్తగా నిర్మించిన గ్రామంలో స్ధిరపడ్డారు. ప్రస్తుతం వేసవి కాలంలో సరస్సు వద్దకు హైకర్స్ వస్తుంటారు. సరస్సు అడుగున ఉన్న 14వ శతాబ్దానికి చెందిన చర్చి టవర్​తో పాటు గోడలు, సెల్లార్లు, మెట్ల దారి ఉన్న ఫోటో లు షేర్ కావడంతో ఈ విషయం వెలుగు చూసింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •