జాతీయం (National) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

ఆడి ఇ-ట్రోన్ ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ..??

జర్మన్ కంపెనీ లగ్జరీ కార్ బ్రాండ్ ఆడి కార్ గత జులైలో భారత మార్కెట్లో విడుదల చేసిన తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు ‘ఆడి ఇ-ట్రోన్’ ఇప్పటికే పూర్తిగా అమ్మకాలు జరిపారు. ఈ కారు మార్కెట్లోకి వచ్చిన 20 రోజుల్లోనే మొదటి బ్యాచ్ మొత్తం అమ్ముడైపోయింది. .ఇక ఆడి ఇ-ట్రోన్ ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇంకా ఇ-ట్రోన్ స్పోర్ట్‌బ్యాక్ మోడళ్లను కంపెనీ గత నెల 22వ తేదీన దేశీయ విపణిలో విడుదల చేయగా ఇండియన్ కస్టమర్ల నుండి ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ కారుకు మెరుగైన స్పందన లభిస్తోందని ఆడి ఇండియా అధ్యక్షుడు వెల్లడించారు.

ఆడి ఇండియా ఈ ఎలక్ట్రిక్ కారును ఇ-ట్రోన్ 50, ఇ-ట్రోన్ 55 ఇంకా ఇ-ట్రోన్ స్పోర్ట్‌బ్యాక్ అనే మూడు వేరియంట్లలో విడుదల చేయడం జరిగింది. ఇండియా మార్కెట్లో ఆడి ఇ-ట్రోన్ ఎలక్ట్రిక్ కారు ధరలు రూ.99.99 లక్షల నుండి స్టార్ట్ అవుతాయి.ఇక ఆడి ఈ-ట్రోన్ ఎలక్ట్రిక్ కారును కంపెనీ పూర్తిగా విదేశాల్లో తయారు చేసి కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (సిబియూ) రూట్‌లో భారతదేశానికి దిగుమతి చేసుకొని అమ్మడం జరుగుతుంది. దాని ఫలితంగా, ఈ కారు ధర కూడా సాధారణం కన్నా రెట్టింపుగా ఉంటుందట.

ఈ నేపథ్యంలో రెండవ బ్యాచ్‌ను ఎప్పుడు దిగుమతి చేసుకునే విషయాన్ని మాత్రం ఇంకా కంపెనీ తెలియజేయలేదు.ఇక ఆడి ఇ-ట్రోన్ 50 క్వాట్రో వేరియంట్‌లో 71.2 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించదాంతో ఇది ఎక్కువ 312 బిహెచ్‌పి శక్తిని ఇంకా 540 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో మరింత శక్తివంతమైన 55 క్వాట్రో ఇంకా ఎస్ వేరియంట్లు రెండూ 95 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తాయని సంస్థ తెలిపింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •