వార్తలు (News)

రాబోయే 3 రోజులు వర్షాలు, పిడుగులు పడే అవకాశం??

పశ్చిమ, నైరుతి గాలుల ప్రభావంతో రాష్ట్రంలో క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయని , ఈ గాలుల కారణంగానే వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కొద్దిరోజులుగా నెమ్మదించిన రుతుపవనాలు ప్రస్తుతం చురుగ్గా కదులుతున్నాయని, మరోవైపు రాబోయే రెండు,మూడు రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ అల్పపీడన ప్రభావంతో ఏపీతో పాటుగా, తెలంగాణ వ్యాప్తంగా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది.

ఏపీ విషయానికి వస్తే.. పశ్చిమ మధ్య-వాయవ్య బంగాళాఖాతంలో ఈ నెల 15 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, 48 గంటల్లో ఆ అల్పపీడనం బలపడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో ఆగస్టు 15, 16, 17వ తేదీల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. జార్ఘండ్ నుంచి ఒడిశా వరకూ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని..మరోవైపు ఉత్తర కోస్తా మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడిందని ఐఎండీ వెల్లడించింది. ఇప్పటి వరకూ నైరుతి నుంచి వాయువ్యం మీదుగా వీచిన గాలులు..ఇక నుంచి నైరుతి నుంచి ఈశాన్యం వైపుకు వీయనున్నట్లు తెలిపింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •