అంతర్జాతీయం (International) ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

కోకా కోలా సరస్సు.. జబ్బులు నిజంగా పోగొడుతుందా??

ప్రపంచంలో అతి పెద్ద కూల్‌డ్రింక్స్‌ బ్రాండ్ గా కోకా కోలా పేరు తెచ్చుకుంది. చిన్న పల్లెటూరికి పోయినా ఈ కూల్‌డ్రింక్స్‌ తెలియనివాళ్లు ఉండరు. అయితే మీకు కోకా కోలా గురించి తెలియని విషయం ఒకటి ఉంది అదేంటంటే.. కోకా కోలా పేరుతో ఉన్న ఒక సరస్సు బ్రెజిల్‌లో ఉంది. దీని అసలు పేరు అరారాక్వారా లేక్.

ఇది కోకా కోలా డ్రింక్‌తో నింపిన సరస్సో లేక ఆ కంపెనీ ఏర్పాటు చేసిన సరస్సో కాదు. బ్రెజిల్‌లో అతి పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్. ప్రకృతి సహజంగా ఏర్పడిన లేక్ ఇది. అట్లాంటిక్‌ ఫారెస్ట్ రిజర్వ్‌లో రియో గ్రాండ్ డెల్ నొర్టె రీజియన్‌లోని మాటా డీ ఎస్టరలా రిజర్వ్‌లో ఈ కోకా కోలా సరస్సు ఉంది. దానిలో ఉండే వాటర్ కలర్ కారణంగా ఇది కోకా కోలా లేక్ అనే పేరుతో పాపులర్ అయిపోయింది. దీనిని లగావో డీ కోకా కోలా అని కూడా పిలుస్తారు.

కోకా కోలా లేక్‌లో నీటిలో మునగడానికి భయపడాల్సిన అవసరం లేదని, ఎటువంటి కాలుష్యం లేదని బ్రెజిల్ టూరిజం డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. పైగా ఈ నీటికి జబ్బులను పోగొట్టే శక్తి ఉందని లోకల్స్ నమ్ముతారట. చుట్టూ తెల్లటి ఇసుక తిన్నెలు, పచ్చటి చెట్లతో నిండిన కొండలు ఉండడం వల్ల ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం టూరిస్టులను ఎంతగానో అట్రాక్ట్ చేస్తోంది.

ఇంతకీ అక్కడ నీరు ఆ రంగులో ఉండడానికి కారణం అక్కడి నేలలోని కెమికల్ కాంబినేషన్‌ వల్లే ఆ వాటర్ ఇలా ఉన్నాయి. నేలలో ఐరన్‌ఆక్సైడ్‌, అయోడిన్‌ స్థాయిలు ఎక్కువగా ఉండడం వల్లే ఆ డార్క్ కలర్‌లో ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    34
    Shares
  • 34
  •  
  •  
  •  
  •