అంతర్జాతీయం (International) జాతీయం (National) వార్తలు (News) స్పోర్ట్స్ (Sports)

ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 2వ ర్యాంక్‌కు చేరుకున్న నీరజ్ చోప్రా!!

భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా టోక్యో ఒలింపిక్స్‌లో కనబరిచిన స్వర్ణ పతక ప్రదర్శన ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ ఈవెంట్స్‌లో పది అద్భుత ఘట్టాల్లో చోటు సంపాదించుకుంది. 23 ఏళ్ల చోప్రా ఫైనల్లో ఈటెను 87.58 మీటర్ల దూరం విసిరి చాంపియన్‌గా నిలవడమే కాకుండా ఒలింపిక్స్‌ అథ్లెటిక్స్‌లో వ్యక్తిగత స్వర్ణం గెలిచిన తొలి భారత అథ్లెట్‌గా చరిత్రలో పేజీ సంపాదించుకున్నాడు.

విశ్వక్రీడల్లో బంగారు విజేతగా చరిత్ర సృష్టించాక అతని ప్రొఫైల్‌ ఆకాశాన్ని తాకింది. విజయం తర్వాత నీరజ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ‘ఈ అనుభూతి అద్భుతమైంది. ఈ క్షణం నాతో చిరకాలం ఉండిపోతుంది. దేశానికి స్వర్ణం అందించేందుకు నాకు మద్దతు తెలిపినవారికి, ఆశీర్వదించిన వారికి ధన్యవాదాలు’ అని పోస్ట్‌ చేశాడు. ఇది లక్షల మందిని చేరుకుంది. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించడంతో నీరజ్‌ చోప్రా జావెలిన్‌ త్రో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌ను అందుకున్నాడు. గత ర్యాంకింగ్స్‌లో 16వ స్థానంలో నిలిచిన నీరజ్‌ బుధవారం ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో ఏకంగా 14 స్థానాలు ఎగబాకి 2వ ర్యాంక్‌కు చేరుకోవడం దేశం గర్వించదగ్గ విషయం!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •