వార్తలు (News)

427 గ్రామాలకు పెదరాయుడు.. ఐదవ తరగతి చదివే బాలుడు!!

పంచాయతీ వ్యవస్థ ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో శాసిస్తూనే ఉంది. అందులో గ్రామపెద్ద చెప్పిందే వేదం. ఆయన చెప్పిన తీర్పుని తూ. చ తప్పకుండ పాటిస్తారు. అలాగే తమిళనాడులోని కొన్ని గ్రామాల్లోనూ ఈ వ్యవస్థ వేళ్ళూనుకుపోయి ఉంది. తూర్పు కనుమలకు ఆనుకొని తిరువన్నామలై, వెల్లూర్, తిరుపట్టూర్‌ జిల్లాల్లో 427 గ్రామాలు ఉన్నాయి. గత 80 ఏళ్లుగా ఈ గ్రామాలకు పెద్దగా వ్యవహరించిన మల్లిమాడుకు చెందిన చిన్నంది(87) అనారోగ్య కారణాలతో గతేడాది చనిపోయారు. అప్పటి నుండి ఆయన వారసుడిగా ఎవరిని ఎంపిక చేయాలనే విషయం పై మల్లగుల్లాలు పడిన అనంతరం చివరికి చిన్నంది మనవడు శక్తివేల్‌ను గ్రామ పెద్దగా ఎంపిక చేసారు. మనవడు వారసుడిగా రావడం వింతేమీ కాదు కానీ శక్తివేల్‌ ప్రస్తుతం నవాలూర్‌ పంచాయతీ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. అంత చిన్న పిల్లవాడికి ఈ బాధ్యతను అప్పజెప్పారు. ఈ నిర్ణయాన్ని మిగిలిన గ్రామాల ప్రజలు స్వాగతించారు అదే విచిత్రం!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •