జాతీయం (National) వార్తలు (News)

భారీ లాభాలతో ముగిసిన నేటి మార్కెట్లు!!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నేడు మరల భారీ లాభాల బాట పట్టాయి. ఉదయం 54,669 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్‌ స్వల్ప ఒడుదొడుకులు ఎదుర్కొని చివరకు 318.05 పాయింట్ల లాభంతో 54,843.98 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా 82.10 పాయింట్ల లాభంతో 16,364.40 వద్ద స్థిరపడింది.

నిఫ్టీలో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టెక్‌ మహీంద్రా, టాటా మోటార్స్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఎల్‌అండ్‌టీ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌, ఓఎన్‌జీసీ, ఐషర్‌ మోటార్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ షేర్లు నష్టాలు చవిచూశాయి. ఫార్మా మినహా అన్ని రంగాల షేర్లు రాణించాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    24
    Shares
  • 24
  •  
  •  
  •  
  •