జాతీయం (National) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

కొత్త వెబ్‌సైట్‌లో పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్ చేయాలంటే??

మీరు మీ పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ 021 సెప్టెంబర్ 30 లోగా లింక్ చేయాలని తెలుసు కదా.. మరి మీరు చేసారా?చేయకపోతే మీ పాన్ కార్డ్ ఇనాక్టీవ్‌గా మారిపోతుంది కాబట్టి ఆధార్ నెంబర్ లింక్ చేయని పాన్ కార్డ్ చెల్లదు. ఆ పాన్ కార్డును ఎక్కడా ఉపయోగించడానికి వీల్లేదు. ఒకవేళ ఆధార్ లింక్ చేయని పాన్ కార్డ్ ఉపయోగిస్తే ఫైన్ చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి గడువు లోగా పాన్ కార్డు ఉన్నవారంతా తమ ఆధార్ నెంబర్‌ను లింక్ చేయాల్సిందే. ఇ-ఫైలింగ్ పోర్టల్ 2.0 వెబ్‌సైట్‌లో కూడా పాన్ ఆధార్ లింక్ చేసే విధానం ఉంది కానీ అది కాస్త మారింది. రి కొత్త వెబ్‌సైట్‌లో పాన్, ఆధార్ ఎలా లింక్ చేయాలో ఇప్పుడు చూడండి!

పాన్, ఆధార్ నెంబర్లు లింక్ పద్దతి:
పాన్ కార్డ్ హోల్డర్లు ముందుగా ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్ https://www.incometax.gov.in/ ఓపెన్ చేయాలి.
ఇటీవల రూపొందించిన కొత్త వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది.
హోమ్ పేజీలోనే Link Aadhaar లింక్ కనిపిస్తుంది. క్లిక్ చేయాలి.
మొదట పాన్ నెంబర్ ఎంటర్ చేసి రెండో కాలమ్‌లో ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి.
ఆ తర్వాత ఆధార్ కార్డులో ఉన్నట్టుగా పేరు టైప్ చేయాలి.
తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.
ఒకవేళ మీ ఆధార్ కార్డుపై పుట్టిన సంవత్సరం మాత్రమే ఉంటే I have only year of birth in Aadhaar card సెలెక్ట్ చేయాలి.
ఆ తర్వాత I agree to validate my Aadhaar details సెలెక్ట్ చేయాలి.
తర్వాత Link Aadhaar క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
ఓటీపీ ఎంటర్ చేసి Validate పైన క్లిక్ చేయాలి.
మీ పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్ అవుతుంది.
ఒకవేళ మీ పాన్, ఆధార్ నెంబర్ ముందే లింక్ అయితే Your PAN is already linked to given Aadhaar అనే మెసేజ్ కనిపిస్తుంది.

పాన్, ఆధార్ లింక్ స్టేటస్ చూడాలంటే:
మీరు ముందే పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్ చేసినట్టైతే https://www.incometax.gov.in/ వెబ్‌సైట్‌లో స్టేటస్ తెలుసుకోవచ్చు.
ముందుగా https://www.incometax.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత Link Aadhaar Status లింక్ క్లిక్ చేయాలి.
పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి.
View Link Aadhaar Status పైన క్లిక్ చేయాలి.
మీ పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ అయిందో లేదో స్టేటస్ తెలుస్తుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •