అంతర్జాతీయం (International) జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

చంద్రుడిపై నీటి చలమలు..??

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO)ఎంతో ప్రతిష్ఠాత్మకంగా 2019లో చేపట్టిన చంద్రయాన్ 2 ప్రయోగం విఫలమైన విషయం మనందరికీ తెలిసిందే! ఇప్పటి వరకూ భూమి వైపు కనపించని చంద్రుడి భాగంపై అధ్యయనం చేయడానికి ఈ మిషన్‌ను లాంచ్ చేయగా చివరి నిమిషాల్లో రోవర్ చంద్రుడి ఉపరితలంపై కుప్పకూలింది. అయితే చంద్రుడిపై దిగే సమయంలో రోవర్ కూలిపోయినా ఇందులోని ఆర్బిటర్ మాత్రం ఇంకా చంద్రుని చుట్టూ తిరుగుతూ కీలక సమాచారాన్ని భూమికి పంపిస్తూనే ఉంది.

ఇప్పుడు ఈ విషయం ఎందుకు తెరమీదకు వచ్చిందంటే.. చంద్రయాన్‌ 2 ఆర్బిటర్‌లోని ఇమేజింగ్ ఇన్‌ఫ్రారెడ్ స్పెక్ట్రోమీటర్ (ఐఐఆర్ఎస్‌) చంద్రుడి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ నుంచి సేకరించిన డేటాను పంపించింది. చంద్రయాన్ 2 ఆర్బిటర్ లోని ఇమేజింగ్ ఇన్‌ఫ్రారెడ్ స్పెక్ట్రోమీటర్ (ఐఐఆర్‌ఎస్) చంద్రుడి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ నుంచి సేకరించిన డేటాను పంపించగా ఐఐఆర్‌ఎస్ సెన్సర్ లోని డేటాని విశ్లేషించనప్పుడు చంద్రుడిపై హైడ్రాక్సిల్, నీటి అణువుల జాడ కనిపించింది. ఈ పరిశోధనకు సంబంధించిన ఫలితాలను కరెంట్ సైన్స్ అనే జర్నల్‌లో ప్రచురించగా చంద్రుడిపై 29 నుంచి 62 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య నీటి జాడలను గుర్తించినట్టు, చంద్రుడి పై అక్షాంశాల్లోని సూర్యకిరణాలు ఎక్కువగా పడే ప్రాంతాల్లో ఈ హైడ్రాక్సిల్‌, నీటి జాడలు ఎక్కువగా ఉన్నట్లు కూడా తేలింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    66
    Shares
  • 66
  •  
  •  
  •  
  •