జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

రైల్ వీల్ ఫ్యాక్టరీలో 192 ఉద్యోగాలు!!

బెంగళూరులోని రైల్ వీల్ ఫ్యాక్టరీ లో అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేసేందుకు కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన జాబ్ నోటిఫికేషన్ కు చివరి తేదీ సెప్టెంబర్ 13 గా నిర్ణయించిన సంగతి పాఠకులకు తెలిసిందే! మొత్తం 192 అప్రెంటీస్ పోస్టుల్లో మెషినిస్ట్, ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఎలక్ట్రీషియన్ లు ఉన్నాయి. అభ్యర్థులు రిజిస్టర్డ్ పోస్టు ద్వారా దరఖాస్తుల్ని నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీలోగా చేరేలా పంపాలి. రైల్ వీల్ ఫ్యాక్టరీ అధికారిక వెబ్‌సైట్‌లో అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేయొచ్చు.

మొత్తం వివరాలు :
మొత్తం ఖాళీలు 192
ఫిట్టర్ 85
మెషినిస్ట్ 31
మెకానిక్ (మోటార్ వెహికిల్) 8
టర్నర్ 5
సీఎన్‌సీ ప్రోగ్రామింగ్ కమ్ ఆపరేటర్ (సీఓఈ గ్రూప్) 23
ఎలక్ట్రీషియన్ 18
ఎలక్ట్రానిక్ మెకానిక్ 22

ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభం- 2021 ఆగస్ట్ 13
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 సెప్టెంబర్ 13

ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల- చివరి తేదీ నుంచి 45 రోజుల్లోగా
శిక్షణ ప్రారంభం- మెరిట్ లిస్ట్ వచ్చిన 15 రోజుల తర్వాత
విద్యార్హతలు- 10వ తరగతి పాస్ కావడంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి.

స్టైపెండ్- ఫిట్టర్, మెషినిస్ట్, మెకానిక్ (మోటార్ వెహికిల్), టర్నర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్ పోస్టులకు రూ.12,261. సీఎన్‌సీ ప్రోగ్రామింగ్ కమ్ ఆపరేటర్ (సీఓఈ గ్రూప్) పోస్టులకు రూ.10,899.

దరఖాస్తు ఫీజు- రూ.100. ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు.
ఎంపిక విధానం- మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు

అభ్యర్థులు రైల్ వీల్ ఫ్యాక్టరీ అధికారిక వెబ్‌సైట్ https://rwf.indianrailways.gov.in/ లో దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసి పూర్తి చేయాలి.
అవసరమైన డాక్యుమెంట్స్ జత చేయాలి.
అప్లికేషన్ ఫామ్ జిరాక్స్ కాపీ రిఫరెన్స్ కోసం భద్రపర్చుకోవాలి.
దరఖాస్తుల్ని రిజిస్టర్డ్ పోస్టు ద్వారా నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు పంపాలి.

దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
ది సీనియర్ పర్సనల్ ఆఫీసర్,
పర్సనల్ డిపార్ట్‌మెంట్,
రైల్ వీల్ ఫ్యాక్టరీ,
యెలహంక, బెంగళూరు- 560064.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •