వార్తలు (News)

ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌ కిట్‌ ధరను తగ్గించిన అమెజాన్‌!!

కరోనా సంక్షోభం మొదలైనప్పటి నుంచి కోవిడ్‌ 19 నిర్థారణ పరీక్షలు సర్వసాధారణంగా మారిపోయి ముఖ్యంగా కొత్త ప్రదేశాలకు వెళ్లాలంటే ఆర్టీపీసీఆర్‌ పరీక్ష తప్పనిసరిగా మారింది. ఇండియాతో పాటు ప్రపంచ దేశాల్లో ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌నే ఎక్కువ మంది ప్రామాణికంగా తీసుకుంటున్నారు. దీంతో తమ వెబ్‌సైట్‌ ద్వారా అమ్ముతోన్న ఆర్టీపీఆర్‌ టెస్ట్‌ కిట్‌ ధరను తగ్గిస్తున్నట్టు అమెజాన్‌ డాట్‌ కామ్‌ ప్రకటించింది. దీంతో ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌ కిట్‌ ధర 3 డాలర్లు తగ్గి 36.99 డాలర్లకు చేరుకుంది. అమెజాన్‌ డాట్‌ కామ్‌ సైట్‌లో అందుబాటులో ఉన్న ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌ కిట్‌కి యూఎస్‌ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్ అనుమతి ఉంది. అయితే ఇండియాలో ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌ కిట్లకు అనుమతి లేదు. కేవలం యాంటి జెన్‌ టెస్ట్‌ కిట్లకే అనుమతి ఉంది. ప్రస్తుతం అమెజాన్‌లో యాంటిజెన్‌ టెస్ట్‌ కిట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటి ధర రూ. 250 నుంచి 500ల వరకు ఉంటుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •