క్రైమ్ (Crime) రాజకీయం (Politics) వార్తలు (News)

వివేకా హత్య కేసులో మరో ముందడుగు??

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసుకి సంబంధించి మరో అడుగు ముందుకు పడింది. వివేకా హత్య కేసులో సీబీఐ అరెస్టు చేసిన ఉమా శంకర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులోని అంశాలు ఇప్పుడు సంచలనంగా మారడం విశేషం! వివేకా హత్య కేసులో సునిల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి పాత్ర పై ఆధారాలు ఉన్నాయని, వీరిద్దరి కుట్ర కోణం ఉందని తమ విచారణ లో వెల్లడైందని సునిల్ యాదవ్ విచారణ సందర్భంగా చెప్పారు

వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి 164 కింద ఇచ్చిన వాంగ్మూలం లో ఉమాశంకర్ రెడ్డి పాత్ర ఉందని చెప్పినట్టుగా, వివేకా హత్య కు ముందే ఆయన ఇంటి కుక్కను సునిల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి కలిసి కారుతో ఢీ కొట్టి చంపేశారని, వివేకాను హత్య చేయడానికి సునిల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి పల్సర్ బైకు లో వెళ్లారు అని ఆయన వివరించారు. ఉమా శంకర్ రెడ్డి పల్సర్ బైక్ లో గొడ్డలి పెట్టుకొని పారిపోయారు అని బైకు, గొడ్డలి స్వాధీనం చేసుకున్నాం అని, గుజరాత్ నుండి ఫోరెన్సిక్ నివేదిక కూడా తెప్పించాము అని అధికారులు పేర్కొన్నారు. గత నెల 11న ఉమా శంకర్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించి రెండు చొక్కాలు స్వాధీనం చేసుకున్నాం అని, మరికొందరు నిందితులు, ఆయుధాలు స్వాధీనం చేసుకోవాల్సి ఉంది అని వివరిస్తూ ఉమా శంకర్ రెడ్డి ని 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •