వార్తలు (News)

నల్గొండ జిల్లాలో విజృంభిస్తున్న కరోనా!!

తెలంగాణాలో పలు జిల్లాల్లోని పాఠశాలల్లో కరోనా వైరస్ విజృంభిస్తూ ఉపాధ్యాయులను, విద్యార్థులను కలవరపెడుతుంది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఎలాంటి భయమూ వద్దని ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నా కరోనా తన పని తాను చేసుకుని పోతుంది. తాజాగా కరోనా తో స్కూల్ ప్రిన్సిపాల్ మరణించారు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి పూర్తి స్థాయిలో తరగతులు నిర్వహిస్తున్న సమయంలో కరోనా వ్యాప్తి తల్లిదండ్రుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. నల్గొండ జిల్లాలో ఉపాధ్యాయులను కోవిడ్ వణికిస్తోంది. సెయింట్ ఆల్ఫోన్సెస్ హైస్కూల్ లో కరోనా కలకలం సృష్టిస్తోంది. హైస్కూల్ లో ప్రిన్సిపాల్ జార్జ్ జోసఫ్ సహా మరో ముగ్గురు ఉపాధ్యాయులకు , కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. ప్రిన్సిపాల్ జార్జ్ జోసఫ్ మృతి చెందారు. దీంతో వైరస్‌ సోకిన వారిని ప్రత్యేకంగా ఉంచి వైద్యం అందిస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •