వార్తలు (News)

రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి!!

రాజస్థాన్ రాష్ట్రంలో బస్సును కారు ఢీ కొట్టిన ప్రమాదంలో నలుగురు మహిళలు మృతిచెందగా మరో 10 మంది వరకు గాయపడ్డారు. ఈ ప్రమాదం బార్మేర్ గ్రామంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. 18 మంది ప్రయాణీకులతో వెలుతున్న కారు బార్మేర్ గ్రామం వద్ద అదుపు తప్పి బస్సును చాలా వేగంగా ఢీ కొట్టడంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్తలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలకై ఇంకా విచారణ జరుగుతుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •