టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

బీహెచ్ఈఎల్ లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!!

భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. దరఖాస్తు చేసుకోవాలనుకొనే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ bhel.comను సందర్శించాలి.
పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి:
ఇంజనీర్ (FTA- సివిల్) – 7
సూపర్‌వైజర్ (FTA- సివిల్) – 15
దరఖాస్తుకు చివరి తేదీ – సెప్టెంబర్ 24, 2021
పూర్తి వివరాలు :
అర్హతలు : ఇంజనీర్ (FTA- సివిల్) :
గుర్తింపు పొందిన యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్‌లో ఇంజనీరింగ్/టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. పవర్ ప్లాంట్, స్టీల్ ప్లాంట్, సిమెంట్ ప్లాంట్, రిఫైనరీలు, పెట్రో- వంటి మౌలిక సదుపాయాల పరిశ్రమలలో రీన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ స్ట్రక్చర్స్ (RCC) / స్ట్రక్చరల్ స్టీల్ ఫాబ్రికేషన్ మరియు ఎరక్షన్ వర్క్ / పైలింగ్ వర్క్ / RCC చిమ్నీ, రసాయనాలు లేదా ఏదైనా ఇతర భారీ స్థాయి పారిశ్రామిక / మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్వహణలో రెండేళ్ల వృత్తి అనుభవం ఉండాలి.

సూపర్వైజర్ (FTA- సివిల్):
ఏదైన గుర్తింపు పొందిన యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి. జనరల్/OBC/EWS అభ్యర్థులకు 60 శాతం మార్కులు కలిగి ఉండాఇ. SC/ST అభ్యర్థులు కనీసం 50% మార్కులు కలిగి ఉండాలి. రసాయనాలు లేదా ఏదైనా ఇతర భారీ స్థాయి పారిశ్రామిక / మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు. పవర్ ప్లాంట్, స్టీల్ ప్లాంట్, సిమెంట్ ప్లాంట్, రిఫైనరీలు, పెట్రో- వంటి మౌలిక సదుపాయాల పరిశ్రమలలో రీన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ స్ట్రక్చర్స్ (RCC)/ స్ట్రక్చరల్ స్టీల్ ఫాబ్రికేషన్ మరియు ఎరేక్షన్ వర్క్/ పైలింగ్ వర్క్/ RCC చిమ్నీ అమలులో అభ్యర్థులు రెండు సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం ఉండాలి.

వయసు:
సెప్టెంబర్ 1, 2021 నాటికి అభ్యర్థుల వయస్సు 34 ఏళ్లకు మించకూడదు. అయితే, OBC (నాన్ క్రీమీ లేయర్) కేటగిరీకి, గరిష్ట వయోపరిమితి 3 సంవత్సరాలు మరియు SC/ST కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు చేసుకొనే విధానం..
అభ్యర్థి ముందుగా అధికారిక BHEL వెబ్‌సైట్‌ను bhel.com ను ఓపెన్ చేసి హోమ్‌ పేజీలో ‘కెరీర్ విత్ భెల్’ విభాగం కింద “కరెంట్ జాబ్ ఓపెనింగ్స్” పై క్లిక్ చేస్తే కొత్త విండో తెరుచుకొంటుంది. అక్కడ “BHEL PSER వద్ద సూపర్వైజర్‌లు, ఇంజనీర్‌లు అవసరం అనే ఆప్షన్‌పై క్లిక్‌చేయాలి. అనంతరం ఆన్‌లైన్ అప్లే వద్ద క్లిక్ చేసి, ఆపై ‘I accept అని క్లిక్ చేయాలి. మీరు దరఖాస్తు చేసుకోవాలనుకున్న పోస్టును ఎంచుకొని ఫాం నింపి ‘సబ్మిట్’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. భవిష్యత్తు సూచన కోసం ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేయండి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •