వార్తలు (News)

వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగిస్తే మా వైవాహిక బంధం ముగుస్తుంది..??

కరోనా కారణంగా సాఫ్ట్‌వేర్‌ సహా చాలా రంగాల్లో ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్ హోమ్ చేసుకునే వెసులుబాటు ఇవ్వడంతో ఉద్యోగులు అంతా ఇళ్ల నుంచే పని చేస్తున్నారు. సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో దాదాపు రెండేళ్ల నుంచి వర్క్‌ ఫ్రం హోం కంటిన్యూ అవుతోంది. అంతవరకూ బానే ఉంది. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల కంపెనీలకు, ఉద్యోగులకు ఎలాంటి ప్లస్ పాయింట్లు, లాభాలు ఉన్నాయో తెలీదు కానీ, వర్క్‌ ఫ్రం హోం వల్ల ఇళ్లల్లో ఆడవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారి చాకిరి మరింత పెరిగినట్టుగా పలు నివేదికలు వెల్లడించాయి. ఈ నివేదికల్లో ఉన్నది వాస్తవమే అని అర్థం అవుతుంది.

ఒక మహిళ తన భర్త కంపెనీకి రాసిన లెటర్‌ని గోయెంకా ట్వీట్‌ చేస్తూ దీనిలో సదరు మహిళ నా భర్తకు వర్క్‌ ఫ్రం హోం చాలు ఇక ఆఫీసుకు పిలవండి, ఇంకొద్ది రోజులు వర్క్‌ ఫ్రం హోం ఇలానే కొనసాగితే మా వైవాహిక బంధం ముగుస్తుందని తెలపడం గమనార్హం.

సార్‌ నేను మీ కంపెనీలో పని చేసే మనోజ్‌ అనే ఉద్యోగి భార్యను. నేను మీకు సవినయంగా విన్నవించుకుంటుంది ఒక్కటే. నా భర్తకు ఆఫీస్‌కు వచ్చి పనిచేసే అవకాశం ఇవ్వండి. అతను ఇప్పటికే టీకా రెండు డోసులు వేసుకున్నాడు. అన్ని కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ పాటిస్తాడు. దయచేసి అతడిని ఆఫీస్‌కు రమ్మనండి. మీరు ఇలానే మరి కొన్నాళ్లు నా భర్తకు వర్క్‌ ఫ్రం హోం ఇస్తే మా వైవాహిక జీవితం ముగిసిపోతుంది. ఎందుకంటే వర్క్‌ ఫ్రం హోం మొదలైన నాటి నుంచి నాకు పని భారం పెరిగింది. నా భర్త రోజుకు పది సార్లు కాఫీ తాగుతాడు.. ఒక్క గదిలో కూర్చుని పని చేయడు. వేర్వురు గదుల్లో కూర్చుని అక్కడంతా చెత్తా చెదారం పడేస్తాడు. ఇక రోజుకు ఎన్నిసార్లు తింటున్నాడో లెక్కేలేదు. వర్క్‌ కాల్స్‌ సమయంలో కునికిపాట్లు పడుతుంటాడు” అని తాను ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చింది.

అంతేకాదు ”ఇప్పటికే నాకు ఇద్దరు పిల్లలున్నారు. వారి బాగోగులు చూడ్డానికే సమయం సరిపోవడం లేదు. వారికి తోడు ఇప్పుడు నా భర్త వచ్చి చేరాడు. ఇంతమందికి సేవ చేయడం నా వల్ల కాదు. దయచేసి పెద్ద మనసుతో నా ఇబ్బందిని అర్థం చేసుకుని, నా భర్తను ఆఫీస్‌కు పిలిచి నాకు కొంత విశ్రాంతి ఇవ్వండి” అని కోరినట్టుగా చెప్పారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •