జాతీయం (National) వార్తలు (News)

ఉల్లి ధరలు మళ్ళీ పెరుగుతాయా??

దేశవ్యాప్తంగా కురిసిన వర్షాల కారణంగా ఉల్లిపాయల ధరలు త్వరలోనే రెట్టింపు కానున్నాయని ప్రముఖ మార్కెట్‌ రీసెర్చ్‌ సంస్థ క్రిసిల్‌ వెల్లడించింది. భారత్‌లో ప్రతి నెల సుమారు 13 లక్షల టన్నుల ఉల్లిపాయల వినియోగం జరగుతుండగా ఇందులో సగానికి పైగా పంట మహారాష్ట్ర నుంచే దేశంలోని ఇతర ప్రాంతాలకు సరఫరా అవుతోందని, మహారాష్ట్ర తర్వాత కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలోనూ ఉల్లి ఎక్కువగానే పండిస్తున్నారని అయితే ఇటీవల సంభవించిన తుఫానుల కారణంగా మహారాష్ట్ర, కర్ణాటకలో ఉల్లి సాగు చేయడంలో ఆలస్యమైందని ప్రస్తుతం కురుస్తున్న వానలతో ఉల్లి పంట చేతికి అందడం ఆలస్యం అవుతోందని క్రిసిల్ తెలిపింది.

ఉల్లి రైతులు క్రమంగా నర్సరీలవైపు మొగ్గు చూపుతున్నారని, ఉల్లి దిగుబడి సైతం తగ్గనుందని, మొత్తంగా దసరా, దీపావళి సీజన్‌ నాటికి ఉల్లి ధరలు పెరుగుతాయని క్రిసిల్‌ అంచనా వేస్తూ కృత్రిమ కొరత సృస్టించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •