జాతీయం (National) వార్తలు (News)

అనూహ్యంగా చివరి గంటలో లాభాల వాన!!

నేటి దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాలతో ముగిశాయి. ఉదయం సెన్సెక్స్‌ 60,045.75 పాయింట్ల వద్ద స్తబ్దుగా ప్రారంభమై రోజులో 60,331.74 – 59,885.39 మధ్య కదలాడి చివరకు 148.53 పాయింట్ల లాభంతో 60,284.31 వద్ద ముగిసింది. నిఫ్టీ 18,008.65 – 17,864.95 మధ్య కదలాడి చివరకు 46.00 పాయింట్ల లాభంతో 17,991.95 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌ 30 సూచీలో టైటన్‌ 5.55 శాతం మేర లాభపడింది. ఎస్‌బీఐ, నెస్లే ఇండియా, బజాజ్ ఆటో, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఐటీసీ, టాటా స్టీల్‌, హెచ్‌యూఎల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, కొటాక్‌మహీంద్రా బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ముగిసాయి. అల్ట్రాటెక్ సిమెంట్‌, సన్‌ఫార్మా, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్ మహీంద్రా, ఎంఅండ్‌ఎం, భారతీ ఎయిర్‌టెల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, సన్‌ఫార్మా షేర్లు నష్టాలు చవిచూశాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    4
    Shares
  • 4
  •  
  •  
  •  
  •