క్రైమ్ (Crime) జాతీయం (National) వార్తలు (News)

హెటిరో డ్రగ్స్ ఐటీ సోదాల్లో రూ. 550 కోట్ల బ్లాక్ మనీ!!

హెటిరో సంస్థలో ఐటీ అధికారులు జరిపిన సోదాల్లో రూ. 550 కోట్ల బ్లాక్ మనీని గుర్తించారు. 6 రాష్ట్రాల్లో హెటిరో సంస్ధల్లో 60 చోట్ల 4 రోజులపాటు ఐటీ దాడులు జరుగగా వందల కొద్దీ అట్టపెట్టెల్లో నగదును దాచిపెట్టడాన్ని గుర్తించగా ఆ నగదు రూ. 142 కోట్ల కు తేలింది. బీరువాల నిండా రూ. 500 నోట్ల కట్టలే ఉన్నాయి. నిండా నోట్ల కట్టలున్న ఇనుప బీరువాలను అధికారులు సీజ్‌ చేశారు. చిన్న చిన్న అపార్ట్‌మెంట్లలో ప్లాట్లను కొని డబ్బు దాచినట్టు గుర్తించారు. ఎవరికీ అనుమానం రాకుండా మెడిసిన్ నిల్వ పేరుతో అట్టపెట్టెల్లో రూ. 142 కోట్లు దాచారని, ఇనుప అల్మారాల్లో డబ్బును కుక్కిపెట్టారని, ఒక్కో అల్మారాలో రూ. 5 కోట్ల నగదు దాచారని అధికారులు వెల్లడించారు. డబ్బు లెక్క పెట్టేందుకే రెండు రోజుల సమయం పట్టింది. పెద్ద సంఖ్యలో లాకర్లు గుర్తించిన ఐటీ అధికారులు మూడ్రోజులుగా లాకర్స్‌ను తెరిచి పరిశీలిస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •