రాజకీయం (Politics) వార్తలు (News)

రూ.22 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం ఎలా చేస్తారు : టిడిపి??

కమలాపురం పట్టణంలో డ్రెయినేజి కాల్వల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.22 కోట్ల నిధులు ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేకుండా దుర్వినియోగం అయ్యాయని టిడిపి రాష్ట్ర కార్యదర్శి సాయినాథ్‌ శర్మ ఆరోపించారు.

పట్టణంలో సోమవారం అఖిలపక్ష పార్టీ నాయకులతో కలిసి ఆయన పట్టణంలో పర్యటించి డ్రెయినేజి కాలువల నిర్మాణ తీరును పరిశీలించిన అనంతరం పట్టణ ప్రజలతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కమలా పురం పట్టణానికి డ్రెయినేజీ నిర్మాణం కోసం కాలువలు తవ్వడానికి రూ.22 కోట్లు మంజూరు చేశారని, అధికారుల అలసత్వం కారణంగా, సాంకేతిక పరమైన ప్రణాళికలు లేకుండా ఎక్కడపడితే అక్కడ తమకు ఇష్టం వచ్చిన రీతిలో కాలువల నిర్మాణం చేపట్టి అధికారులు చేతులు దులుపు కోవడంతో ప్రజాధనం దుర్వినియోగం అయిందని తెలిపారు.

సంవత్సర కాలంగా అస్తవ్యస్త డ్రెయినేజి కాలువల నిర్మాణంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ అధికార పార్టీ నాయకులు, ప్రజల ఇబ్బందులు తీర్చడానికి ప్రయత్నించకపోవడం శోచనీయమని, కోట్ల రూపాయల నిధులు ప్రణాళికాబద్ధంగా ప్రజల అవసరాలకు వినియోగించని అధికారులపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ తాము గవర్నర్‌కు, ముఖ్యమంత్రికి, సంబంధిత మంత్రికి, స్థానిక శాసన సభ్యుడుకి వినతి పత్రాలు పంపనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్‌ జిల్లా నాయ కుడు నరసింహులు, అఖిలపక్ష నాయకులు, ప్రజాసంఘాలు, కమలాపురం పట్టణంలోని తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నట్టు సమాచారం!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •