టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

ఫార్మసీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల దరఖాస్తులకు ఆహ్వానం!!

రెండేళ్ల కాలవ్యవధి గల ఫార్మసీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సమన్వయకర్త డా.జి.రాజేశ్వరి తెలిపారు. ఆదివారం శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఆమె మాట్లాడుతూ విద్యార్థులు ఈ నెల 11 నుంచి 19వ తేదీ వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, పదోతరగతి, ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత ధ్రువపత్రాలు తదితరాలతో హాజరు కావాలని, రూ.400 రుసుము చెల్లించాలని, 23న తుది జాబితా ప్రకటించి అనంరతం కౌన్సెలింగ్‌ తేదీలను ప్రకటిస్తామని చెప్పారు.

ఒకేషనల్‌ విద్యార్థులకు ఇంటర్మీడియట్‌లో ఒకేషనల్‌ కోర్సులు చదువుకున్న విద్యార్థులు నేరుగా డిప్లొమా ద్వితీయ సంవత్సరంలో చేరేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు, ఈనెల 8 నుంచి 13వ తేదీ వరకూ గడువు ఉందని 19, 20వ తేదీల్లో వెబ్‌ఆప్షన్లు ఇచ్చుకోవాలని శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రధానాచార్యులు డా.జి.రాజేశ్వరి తెలిపారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    2
    Shares
  • 2
  •  
  •  
  •  
  •