క్రైమ్ (Crime) రాజకీయం (Politics) వార్తలు (News)

పెన్షన్‌ వస్తోందని సాకు.. తెల్లరేషన్‌ కార్డులు కట్!!

గుంటూరులో రాష్ట్ర రిటైర్డ్‌ వీఆర్‌వో, పార్ట్‌టైం పంచాయతీ కార్యదర్శి, వీఏవో, మాజీ గ్రామాధికారుల జేఏసీ సర్వసభ్య సమావేశం జరిగింది. మాజీ గ్రామాధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఈర్లే శ్రీరామమూర్తి మాట్లాడుతూ విధుల్లో ఉన్నంతకాలం గౌరవవేతనంతోనే బతికామన్నారు. తమకు వచ్చే పెన్షన్‌ రూ.4 వేలను సాకుగా చూపి ఈ మధ్య జగన్‌ సర్కార్‌ తెల్లరేషన్‌ కార్డులను తొలగించిందన్నారు. ఈ విషయంపై సీఎం జగన్‌ను కలిసేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా అవకాశమివ్వడం లేదని వాపోయారు. మంత్రులు, ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి ముఖ్యమంత్రిని కలిసేందుకు అవకాశం ఇప్పించాలని అడిగితే ఇంతవరకు తామే కలవలేదని, మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలని అంటున్నారని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి గ్రామాధికారుల వ్యవస్థను తీసుకువచ్చారని, టీడీపీ హయాంలో చంద్రబాబు రాజకీయాలకు అతీతంగా పే స్కేల్‌ అమలు చేశారని వివరించారు.

చంద్రబాబు ఇచ్చిన పే స్కేల్‌ వల్లే ఈరోజు గ్రామాధికారులు చాలా మంది ఆర్‌ఐ స్థాయి వరకు వెళ్లగలిగారని తెలిపారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం మాజీ గ్రామాధికారులపై కక్షసాధింపు చర్యలకు దిగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పెన్షన్‌ రూ.10 వేలకు పెంచాలని, రేషన్‌ కార్డులను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •