వార్తలు (News)

ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి వ్యతిరేక పాలన కొనసాగుతోంది – ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్

ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి వ్యతిరేక పాలన కొనసాగుతోంది – ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్

నంద్యాల పట్టణంలోని అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు నిరసనగా పెనమలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉయ్యురు లోని తెదేపా పార్టీ ఆఫీస్ నుండి బంగ్లావద్దనున్న గాంధీజీ విగ్రహం వరకు పాదయాత్ర ర్యాలీగా వెళ్లి గాంధీగారి విగ్రహానికి మెమొరాండమ్ ఇచ్చిన తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ గారు , మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు

ఈ సందర్బంగా రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ రాష్ట్రంలో రోజు రోజుకి బడుగు బలహీన వర్గాలైన bc, sc, st, మైనార్టీ లపై దాడులు పెరిగిపోతున్నాయ్ అని, నంద్యాలలో మైనార్టీ సోదరుడు సలాం కుటుంబం చిన్నపిల్లలతో సహా ఆత్మహత్య చేసుకునేలా మానసికంగా వేధింపులకు గురి చేసిన పోలీస్ లను కఠినంగా శిక్షించాలని, వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ప్రజా స్వామ్య పాలన లేదని, ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ మైనార్టీ ఉపముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చెయ్యాలని, దీన్ని మా పార్టీ తరుపున తీవ్రంగా ఖoడిస్తున్నామని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ mlc అన్నారు.

బోడే ప్రసాద్ గారు మాట్లాడుతూ అమానుషంగా దొంగతనం అంటగట్టి సలాం కుటుంబాన్ని వేధించి ఆత్మ హత్య చేసుకునేలా చేసారని, వెంటనే ఈ ఘటనపై సిబిఐ ఎంక్వేరి వేసి నిందితుల్ని శిక్షించాలని, చిన్న పిల్లలతో సహా ఆత్మ హత్య చేసుకోవటం మనసుకు బాధకలిగే విషయం అని అన్నారు.

ఈ కార్యక్రమం లో టౌన్ పార్టీ అధ్యక్షులు గుర్నాధరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.