న్యూఢిల్లీ : కోవిడ్ కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కోవిడ్ తర్వాత ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకుంటోందని, దీంతో పాటు పలు రంగాలు కూడా గాడిలో పడుతున్నాయని పేర్కొన్నారు. మూడో త్రైమాసికంలో వృద్ధి రేటు పెరుగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. అక్టోబర్ మాసంలో జీఎస్టీ వసూళ్లు 1.05 లక్షల కోట్ల రూపాయలను దాటిందని, గతేడాది అక్టోబర్ మాసంతో పోలిస్తే ఇది 10 శాతం అధికమని తెలిపారు. స్టాక్ మార్కెట్లు రికార్డులు సృష్టిస్తున్నాయని, బ్యాంకు రుణాలు కూడా 5.1 శాతం పెరిగాయని ప్రకటించారు.విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 13 శాతం పెరిగాయని, 35.37 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయని అన్నారు.కేంద్రం ప్రవేశపెట్టిన ఆత్మ నిర్భర అభియాన్ పథకం సత్ఫలితాలనే ఇచ్చిందని హర్షం వ్యక్తం చేశారు.
‘ఆత్మ నిర్భర్ భారత్ రోజ్‌గార్’ ప్రకటించిన నిర్మలా సీతారామన్