వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీ కేంద్రంలో ని కొత్త తండా శివారులో గుర్తు తెలియని ఓ యువతి దారుణంగా హత్యకు గురైంది. పత్తి చెను కౌల్ చేస్తున్న రైతు కతలప్ప పొలంలో ఈ ఘటన వెలుగుచూసింది. ఆ కౌల్ రైతు పోలీసులు సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి జగిలాలతో చేరుకున్నారు. Dsp కిరణ్ కుమార్ కథనం మేరకు ఓ గుర్తు తెలియని 18నుండి 25 సంత్సరాల మధ్య గల యువతిని వారం రోజుల క్రితం హతమార్చినట్లు ఆయన అనుమానం వ్యక్తం చేశారు.ఈ యువతి శరీరంపై బ్లూ కలర్ జీన్స్ పాయింట్ మాత్రమే ఉన్న అనవాలను బట్టి ఈమెను పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు ప్రాతమికంగా తెలుస్తుందన్నారు చుట్టుపక్కల ప్రాంతాల పోలీస్ స్టేషన్లో ఏవైనా మిస్సింగ్ కేసులు నమోదు అయ్యవని సమాచారాన్ని సేకరిస్తున్నామని అన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ముమ్మరం చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ యువతి ఇక్కడి ప్రాంతానికి చెందినదా లేదా ఇతర ప్రాంతాలకు చెందిన విషయం దర్యాప్తు అనంతరం తెలుస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో ఆత్మకూరు సీఐ,సీతయ్య,ఎస్సై, ఆంజనేయులు ఉన్నారు.