టి.యన్ శేషన్ ” ఈపేరు గుర్తుందా?? భారత ఎలక్షన్ కమీషన్ యొక్క స్వయంప్రతిపత్తి ఎలాంటిదో అధికారకంగా చూపిన ఒక నిజాయితీపరుడైన అధికారి.. ఆయన దెబ్బకు ప్రభుత్వం రాజ్యాంగ సరవణ చేయవలసివచ్చిందంటే ఆయన గొప్పతనం ఏమిటో తెలుస్తుంది..1990 లో భారత చీఫ్ ఎలక్షన్ కమీషనర్ గా నియామకం జరిగిన తరువాత ఈ ఐఏయస్ ఎలక్షన్ కమీషన్ పవరేమిటో చూపించారు.
ముందు తన ఆఫీస్ లోని దేవుడు,దేవతలు,నాయకుల ఫోటోలు తీయించేసారు. ఉద్యోగులందరూ తప్పనిసరిగా గ్రంధాలయంలో కుర్చోనేటట్లుచేసారు..అభ్యర్థుల ఖర్చు విషయాలలో కఠినంగా వ్యవహరించారు. లౌడ్ స్పీకర్లును బ్యాన్ చేసింది ఈయనే. బ్యానర్లు కూడా అభ్యర్థిఖర్చులోనికి వస్తాయని హెచ్చరించారు. ఎలక్షన్స్ జరిగేటప్పుడు అక్కడ ప్రభుత్వసిబ్బంది ఎలక్షన్ కమీషన్ పరిధిలోనికి వస్తుందని,ఎలక్షన్ కమీషన్ ఆదేశాలు ప్రతిఒక్కరూ పాటించాల్సిందేనని తెలియజేశాడు,.కేంద్రం ఒప్పుకోకున్నా..సుప్రీమ్ కోర్టుకు వెళ్ళి విజయం సాధించాడు..చివరికి రాజ్యాంగసవరణ ద్వారా మరో ఇద్దరు కమీనర్స్ ను ప్రభుత్వం నియమించుకుంది..రిటైర్ అయిన తరువాత ప్రభుత్వం కల్పించే ఏ సౌకర్యమూ తీసుకోలేదు..తన ఆస్థిని ఎక్కువభాగం ఒక వృద్ధాశ్రమానికి రాసిచ్చి తన భార్యతో కలిసి ఆశ్రమంలో జీవనం సాగించారు.
నిన్న ఆయన జన్మదినసందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తున్నాము!!