విశాఖపట్నం

రైళ్లలో దొంగతనాలు, పోకిరీల అల్లరి చేష్టలు వంటి ఘటనలు జరగుతుంటాయి.

ఈ తరహా నేరాలను అరికట్టేందుకు తూర్పు కోస్తా రైల్వే పూనుకుంది.

భద్రతా సిబ్బందికి ప్రయాణికులు చేపట్టింది.

ఈ మేరకు తూర్పు కోస్తా రైల్వే జనరల్ మేనేజర్(జీఎం) విద్యా భూషణ్ భద్రతా సిబ్బందికి ఉత్తరులు ఇచ్చారు.

వందకు పైగా రైళ్లలో ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది ఉండాల్సిందిగా ఆదేశించారు.

అన్ని ముఖ్యమైన రైళ్లలోనూ జీరో ఎఫ్​ఐఆర్ నమోదు చేయాలని స్పష్టం చేశారు.

ఈ ఆదేశాల వల్ల తూర్పు కోస్తాలో వందకు పైగా ప్రత్యేక రైళ్లకు ఆర్పీఎఫ్, జీఆర్పీ రక్షణ ఉంటుంది.

ఎఫ్​ఐఆర్ దరఖాస్తులను ముఖ్యమైన రైళ్లలో సిబ్బంది వద్ద అందుబాటులో ఉంచుతారు.

ప్రతి ప్రత్యేక రైళ్లోనూ ఎస్-1 కోచ్​లో 63వ నంబర్ బెర్త్​ను భద్రతా సిబ్బందికి కేటాయించారు.

అలాగే శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ ఏసీ ఛైర్ కార్‌లో నాలుగో నంబర్ సీట్‌ను భద్రతా సిబ్బందికి కేటాయించారు.

రాజధాని ఎక్స్​ప్రెస్​లో పాంట్రీకార్​లో భద్రతా సిబ్బంది ఉంటారు.

పెట్రోలింగ్ సిబ్బందితో ఈ భద్రతా సిబ్బంది సమన్వయం చేసుకునేట్టుగా చర్యలు చేపట్టారు.